32.2 C
Hyderabad
May 12, 2024 21: 10 PM
Slider కవి ప్రపంచం

సగర్వంగా చాటుదాం..

#arunachamarthi

కలల కణాచి నా దేశం

శాస్త్రాన్ని ఆచారంతో ఇచ్చింది సందేశం

ధన్వంతరి చరక శుశ్రుతుల వైద్యం ఆదర్శం

సిద్ధమూలిక వైద్యం నిదర్శనం

బోధిసత్వుడు నేర్పిన విద్య

చేరారు మాదేనని విదేశీయులీమధ్య

అపారం కదా మన జ్ఞానం

చేయి మారకమయ్యాక తెలిసే మన అజ్ఞానం

శూన్యం నుండి లెక్కలు వచ్చిన వైనం

భూమికి సూర్యునికి దూరపు యోజనం

చెప్పారు తేడాలేక ముని జనం

యోగాతో చిత్తం ప్రశాంతం

పరాయి దేశాలు నేర్చుకున్నాయి ఆసాంతం

స్వదేశీ గోమాత చుట్టూ ఉన్న పవిత్ర ఆరా

తెలిసి సొంతం చేసుకున్నారు తీసి ఆరా

నాడు వారు మన చెంత చదువుకొచ్చే పరిస్థితి

ఎగబడుతున్నాం నేడు మారి గ్రహస్థితి

బానిసత్వ సంకెళ్లు తెంచి పొందాం స్వాతంత్ర్యం

అయినా లోబడి పోతున్న స్వతంత్రం

చెట్టు పుట్ట నీరు నిప్పు పూజించే దేశం

ప్రకృతిని ప్రేమించే అంతర్లీన ఆదేశం

కొత్తొక వింతని పాటిస్తున్నాం

మనది కాని జీవితం బ్రతికేస్తున్నాం

తిరిగి తీసుకువద్దాం దేశ వైభోగం

ప్రారంభిస్తే ప్రయత్నం మారరా కనీసం సగం

మాత ,మాతృదేశం కాదేప్పటికీ పురాతనం

ఆరోగ్య రహస్యాన్ని ఇమిడ్చిన మన సనాతనం

అరుణ చామర్తి ముటుకూరి, హనుమకొండ, 9000683826

Related posts

హుజూర్ నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి

Satyam NEWS

కరోనా నుంచి నా కుటుంబాన్ని కాపాడుకునేది ఎలా?

Satyam NEWS

ప్రైవేట్ ఆస్పత్రిలో మూడేళ్ళ చిన్నారి మృతి

Satyam NEWS

Leave a Comment