40.2 C
Hyderabad
April 28, 2024 16: 22 PM
Slider నిజామాబాద్

కేసీఆర్ గజ్వేల్ లో చెల్లని రూపాయి

#shabirali

సీఎం కేసీఆర్ గజ్వేల్ లో చెల్లని రూపాయి అని అక్కడ చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామంలో పర్యటించిన షబ్బీర్ అలీ పై వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్  పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు నిలువరించడానికి కామారెడ్డి నుండి సీఎంకేసిఆర్ పోటీ నినాదం తెరపైకి తెచ్చారన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉందని, అందులో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు అడ్డుకొని నిలదీసే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఈ వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడంతో పాటు కామారెడ్డి బీఆర్ఎస్ టికెట్ కోసం తన అనుచరులే పోటీకి దిగడంతో తన టికెటు పోతుందని ఆందోళనలో గంప ఉన్నారన్నారు.  ఓటమి భయంతోనే సీఎంను పోటీకి ఆహ్వానించారని,  అభివృద్ధి చేయడం చేతకాని అసమర్థ ఎమ్మెల్యే గంప అని విమర్శించారు. గజ్వేల్ లో గ్రామాలన్ని నీట ముంచి కామారెడ్డిని ముంచడానికి వస్తున్నారా అని నిలదీశారు. గజ్వేల్ లో తన ఓటమిని ముందే గ్రహించి ఇక్కడి ప్రజలను మాయ చేయడానికి వస్తున్నారా..? గజ్వేల్ లో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఈరోజు భయంతో పారిపోయి వస్తున్నారా.? అని ప్రశ్నించారు.

సీఎం సొంత గ్రామం అని చెప్పుకోవడం కాదని, అక్కడ ఇంటింటికి 10 లక్షలు ఇచినట్టుగానే ఇక్కడ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి అసెంబ్లీ బరిలో కేసిఆర్, కేటీఆర్, కవిత ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రం తానే పోటీ చేస్తానని పేర్కొన్నారు. కామారెడ్డి గడ్డపై పుట్టిన తాను ఓడినా.. గెలిచినా నియోజకవర్గ ప్రజల సేవలో ఉన్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో నియోజకవర్గాల నుండి పోటీ చేసే అవకాశం వచ్చిన ఇక్కడి ప్రజలను వదిలి వెళ్ళలేనని, ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, కామరెడ్డి ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు.

Related posts

రిపబ్లిక్ డే వేడుకలకు ఐదు ఆసియా దేశాలకు ఆహ్వానం

Sub Editor

వనపర్తి దేవాదాయ భూములను కాపాడండి

Sub Editor

ఉక్రెయిన్ నుండి ఖమ్మానికి చేరుకున్న విద్యార్థులు

Sub Editor 2

Leave a Comment