28.7 C
Hyderabad
May 6, 2024 07: 52 AM
Slider కవి ప్రపంచం

తిరిగిరాని వలస!

#J Shyamala

లాక్డౌన్ లో భీతిగొలిపే ఓ అర్థరాత్రి

రోడ్డుపక్కగా వలసల దిగులు కళ్ళు

దూరంగా ఇళ్ళలో నైట్ బల్బుల వెలుగులు

ఎవరి ఇళ్ళలో వాళ్ళు పదిలంగా

మరి తామో… ఈ పట్నంలో జనంలో ఉన్నా ఒంటరులు

మనసంతా తమ ఊరిమీదే..తమ ఇంటిమీదే

అమ్మా నాన్న కట్టుకున్న ఇల్లాలు

చిన్నా మున్నా బుజ్జి బాబీ ఎట్లున్నారో

దూరంగా లారీ… ఒక్కసారిగా చేతులన్నీ పైకి

డ్రైవర్ దయామయుడు

వలసల్లో అవధుల్లేని ఆనందం

ఈ లారీ తమ అదృష్ట దేవత

అందరిలో అదే భావన

ఎగబడుతూ ఎక్కేశారు

రయ్ మంది లారీ

తెల్లవారితే తమ తమ ఇళ్లల్లో

ఆలోచనలు…అలసట…మగత

హఠాత్తుగా భీకర శబ్దం.. లారీ బోల్తా

వలస కూలీలు మళ్ళీ వలసకు

ఈసారి మరో లోకానికి

జె.శ్యామల

Related posts

వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బిజెపి కసరత్తు

Sub Editor

పంచవటి హాస్పిటల్ పై కమిషన్ కు రాచాల ఫిర్యాదు

Satyam NEWS

డ్రైనేజీ లో జెసిబి సాయంతో చెత్త తొలగింపు

Satyam NEWS

3 comments

కొణతం చైతన్య కుమార్ June 9, 2020 at 10:48 AM

కవిత బాగుంది ఈ వెబ్ సైట్ మెయిల్ ఉంటే పంపించగలరు నా నెంబర్ 9642304154 ఇది నేను కవితలు పంపించాలని ఉంది

Reply
Yuddandi Siva Subramanyam June 10, 2020 at 3:13 AM

Excellent

Reply
Mramalakshmi January 16, 2021 at 6:02 PM

వేదనాభరితమైన కవిత

Reply

Leave a Comment