Slider జాతీయం

శాల్యూట్: సర్వసత్తాక గణతంత్రం మన భారతం

b r ambedkar

రాజ్యాంగం మంచిదే కాని మంచి వారి చేతుల్లో ఉంటేనే మంచిది, చెడ్డవారి చేతుల్లో పడితే చెడ్డదే అవుతుంది అని మహానుభావుడు అంబేద్కర్ ఆనాడే చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతున్నది. కుల మత వైషమ్యాలకు అతీతంగా పాలకులు ఉంటే సమాజం కూడా అదే విధంగా ఉంటుందనేది అనుభవం నేర్పిన పాఠం.

రాజ్యాంగం రాత ప్రతిని తయారు చేయడం కోసం 1947 ఆగష్టు 29 న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అధ్యక్షుడు డా.బి.ఆర్.అంబేద్కర్. భారత ప్రజల అపార త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్య్రం సిద్ధించింది. ఫలితంగా సర్వోత్కృష్టమైన రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం.

భారత దేశాన్ని సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు ఇది అవకాశం అని ఆ సందర్భంగా అంబేద్కర్ అన్నారు. దేశంలోని పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, సమానత్వాన్ని చేకూర్చడానికి రాజ్యాంగం ప్రాధాన్యతనిచ్చింది.

జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి రాజ్యాంగం ఉపకరిస్తుంది. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం మొత్తం 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు. ఈ కాలంలో రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది.

ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది. రాజ్యాంగ రాత ప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు.

1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటు గా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది. స్వాతంత్ర్యానంతర భారత దేశం రాజకీయంగా తన కంటూ ఒక స్వంత అస్థిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్న రోజు ఇది.

Related posts

పెళ్లికి ఇవ్వాల్సిన చెక్కులు పిల్లలు పుట్టినంక ఇస్తురు

Satyam NEWS

అంతర్జాతీయ కరాటే పోటీకి ఎంపికైన శివతేజ

Satyam NEWS

నిరాయుధులైన ఇద్దరు పోలీసుల్ని కాల్చిన ఉగ్రవాది

Satyam NEWS

Leave a Comment