శాసన మండలి చైర్మన్ పోడియం ను ముట్టడించి, మంత్రులు అనుచితంగా ప్రవర్తించారని ప్రతిపక్ష నాయకుడు ఎన్. చంద్రబాబునాయుడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ కు ఫిర్యాదు చేశారు. నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ను చంద్రబాబు నాయుడు కలిశారు. శాసనసభ, మండలిలో ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
చంద్రబాబునాయుడితో బాటు గవర్నర్ ను కలిసిన వారిలో తెలుగుదేశం పార్టీ శాసన మండలి నాయకుడు యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం శాసనసభా పక్షం ఉప నాయకుడు అచ్చెంనాయుడు, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే రామానాయుడు తదితరులు ఉన్నారు.