28.7 C
Hyderabad
April 28, 2024 09: 44 AM
Slider కవి ప్రపంచం

రావమ్మ ప్లవ రా

#Dr,Katikojhvala

రావమ్మ ప్లవ రా…నీ రాకకోసమే మా ఎదురు చూపులు

నీ మేలు కోసమే మా పడి గాపులు

శ్రీ శార్వరి  గాయాలతో భంగపడ్డ బ్రతుకులు మావి

కర్కశ  కరోనా  కాటువేసి సగటుజీవిని జీవచ్ఛవం చేసింది

వచ్చే నువ్వైనా..నిర్మలంగా..నిశ్చలంగా

సస్యశ్యామలంగా..సమున్నతంగా..రా..ప్లవా

కర్షక వీరుల పంట తడి కార్మిక శూరుల కంట తడి

చేనేతన్నల బతుకు ముడి ..భగ భగ మండే భానుడి వేడి..

కోవిడ్-నాఇంటీన్ హడావుడీ గమనిస్తూ రావమ్మా..రా..

రాజకీయ రంగుల్నీ..రారాజుల హంగుల్నీ..పులుముకోకు

సాదాసీదాగా సామన్యుడి పక్షంగా..రా..

మనిషికి దూరమవుతున్న మెతుకుల్నీ

మనసుకి దూరమవుతున బతుకుల్ని

సామాజిక దూరాల్ని పెంచుతున్న వైరసుల్ని

చిరిగిన జీవితాలకు వేసుకుంటున్న అతుకుల్నీ

అర్థం చేసుకుంటూ…రా

పండుగంటే..మెండుగా సంతోషించే జాడలేవి..!?

పండుగంటే..నవ్వుల పువ్వులు పూసే వాడలేవి..!?

కోయిలమ్మ రాగాల్ని కవి హృది  భావాల్ని

ఆత్మీయ పేర్లనీ ఉగాది హుషార్లనీ ఎక్కడ వెతక మంటవ్..!?

కానరాని వసంతాన్ని ఎలా పరుచుకోమంటావ్..!

జాతకాల భ్రమల్లో మెదళ్లనీ ..జీవితాల్లో ఆశల చిగుళ్లనీ

ఇంకెంత కాలం పెంచుకో మంటావ్..!

తీపి పులుపు కారం ఉప్పు చేదు వగరుగా

షడ్రుచులూ వుంటే వుండనీ

చేదు ఒక్కటే మిగల్చకమ్మ ప్లవా…

రంభవై అంబవై జగదంబవై..లాల్ దర్వాజ రాములమ్మవై

జగతి శాంతి కపోతంగా..ప్రగతి కాంతి పతాకంగా..

సమర శీలివై అక్షర పాళివై కాళివై..

రావమ్మా రా..నీకు స్వాగతం శ్రీ ప్లవ  సుస్వాగతం..

డా.కటుకోఝ్వల రమేష్, సెల్:9949083327

Related posts

ప్రగతి భవన్ కుక్కు ఉన్న విలువ ఆడపిల్లకు లేదా?

Satyam NEWS

మానియాక్: తల్లి వయసు ఆంటీతో భార్య ఎదుటే సరసాలు

Satyam NEWS

27న జైలు నుంచి శశికళ విడుదల

Sub Editor

Leave a Comment