39.2 C
Hyderabad
May 3, 2024 14: 03 PM
Slider కవి ప్రపంచం

బ్రహ్మ కల స్పర్శ

#Kayatam Hemanth

బ్రహ్మ కలం స్పర్శలో ఏదో తప్పిదం

జీవకోటిలో పెనుమార్పుతో నిశ్శబ్దం

మానవాళి కరస్పర్శకు నోచుకోలేని క్రిమి భయం

” వికార ” మై సర్వం అస్తవ్యస్తమై “శార్వాణి” కీ తప్పని తప్పిదం.

మారనిది మరవనిది మసిబారినది

సడలింపులేనిది పాతది

వసంత పల్లవులను కురిపించి

మన సాక్షిలను మరిపించి, మురిపించి,

పచ్చదనంతో పూల వాసనలను గుభాళించి

నెమలి నాట్యంతో  అలరించి షడ్రుచులను ఆస్వాదించి

వెలుగులతో నింపుతూ “ప్లవ”నామ ఉగాది

తీపి పులుపులతో మేళవించి కష్టసుఖములనే కలగలిపే జీవితం

నిత్య నూతనంతోనే తనదైన ప్రయాణం.

యుగానికి ఒక్క రోజై అద్భుతమై,విశాలమై

కొత్తదనంతో కొత్త ఆశలతో అందమైన వీక్షణాలతో

ఒకరికి ఒకరై పరులకొరకై ప్రాంతం, రాష్ట్రం, దేశం ఒక్కటై జరుపుకుంటూ

వివిధ పేర్లతో, వివిధ సాంప్రదాయాలతో

తమ జీవితాలలో సంతోషాలను

నింపుతూ వచ్చింది ఉగాది!

చేకూర్పుతో ఆశీర్వాదాలను పెంపుగా అందించమని ఇదే నా కల స్పర్శ.

ప్రొఫెసర్  క్యాతం  హేమంత్, 9949108103

Related posts

ఆసక్తి రేకెత్తిస్తున్న కమల్ 232వ చిత్రం టీజర్

Satyam NEWS

ప్రముఖ లేడీ యాంకర్ హఠాన్మరణం

Bhavani

క్యాపిటల్ ఇష్యూ: ఆర్డినెన్సు ఇస్తే అభాసుపాలు కాక తప్పదు

Satyam NEWS

Leave a Comment