40.2 C
Hyderabad
May 6, 2024 15: 30 PM
కవి ప్రపంచం

ఉజ్వల భవిత

#Tadinada Bhaskararao

ప్రకృతి కాంత పురుడు పోసుకుంటోంది

ప్లవ నామ సంవత్సరం అడుగిడుతోంది

పూగుత్తులతో సుగంధాలు వెదజల్లే వేపచెట్లు

మామిడితోరణాలతో శోభిల్లే గడపలు

అవని అంతా పులకరింపజేసి

సంప్రదాయ సౌరభాలతో ప్రభవిల్లుతోంది

పట్టరాని సంతోషంతో నట్టింట పారాడుతోంది…

కోరికలు కొంటెగాలులై

నిరాశకు తావులేకుండా,నిస్పృ హకు

లోనుకాకుండా

ప్రతిహృదయం ఉగాది సంబరం

చేసుకుంటుంది

మధుమాసం ధరహాసమై

తనువంతా తడుపుతుంది…

కోకిలమ్మ కూయనిదే వసంతం రాదు

కవులు సృజనకళాకారులైనా

కవిబ్రహ్మలనబడే కవిసమ్మేళనాలు

వినబడనిదే ఉగాది గాలి వీచదు

పరిసరాల పలకరింపు శోభ కనబడనిదే ఉగాది లేదు…

కొత్తపోకడలతో,కోరుకున్న ప్రగతితో

ఉజ్వలభవితకు పునాది వేసుకుందాం

శ్రీ ప్లవనామ సంవత్సరానికి

స్వాగతం పలుకుతూ

ఉగాది పచ్చడి సేవిస్తూ ఉన్నతంగా  జీవిద్దాం…

తాడినాడ భాస్కర రావు, తణుకు, 9441831544.

Related posts

అమ్మ భాష కమ్మదనం

Satyam NEWS

అమ్మ ఓ జీవనది

Satyam NEWS

రవికిరణం

Satyam NEWS

Leave a Comment