35.2 C
Hyderabad
May 9, 2024 19: 04 PM
కవి ప్రపంచం

రవికిరణం

#Ghali Lalita Pravallika

మహోన్నత రూపం

ఉజ్వల తేజం

తెలుగు వాకిట విరిసిన పారిజాతం

అధిరోహించెనుమేథో సామ్రాజ్యం

నీతి నియమాలే ఆతని బోధ్యం

ఔపోసన పట్టె నార్థికశాస్ర్తం

దేశ సంక్షోభంలో నిలబెట్టినవైనం

చాణక్యుడనె జనసందోహం

సాహిత్యం ఆయన ఆరో ప్రాణం

సహస్ర ఫణ్ ఆయన అనువాదం

ది ఇన్ సైడర్ ఆయన రచనా కౌశలం

బహుభాషా పండిత్యంఆయన సొంతం

దేశ సేవ కై చేసెన పోరాటం

ప్రజాసేవలో ఆస్తుల అర్పణం

సేవాతత్పరత నిండెను ఆయన కణంకణం

అందుకే ఆయన అయ్యారు రవికిరణం

వెలుగులు పంచుటే ఆయన ధ్యేయం

అందుకే ఆయన మనకు అందరికీ ఆదర్శం

వర్ధిల్లు పి . వీ నరసింహారావు గారి కీర్తికలకాలం

ఘాలి లలిత ప్రవల్లిక, మహబూబ్ నగర్ జిల్లా, చరవాణి : 8309195119

Related posts

అభివందనం

Satyam NEWS

విశ్వశాంతి

Satyam NEWS

తొలి పండుగ

Satyam NEWS

Leave a Comment