33.7 C
Hyderabad
April 30, 2024 00: 52 AM
Slider జాతీయం

గృహ రుణాల మంజూరిలో రూ.5 ట్రిలియన్ మార్క్ దాటిన SBI

#sbi

గృహ రుణాల కోసం అత్యంత ఎక్కువ మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నే ఎంచుకుంటున్నారు. ఈ కారణంగానే గృహ రుణాల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ లీడర్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో 23000కి పైగా శాఖలతో హోమ్ లోన్ వ్యాపారంలో రూ. 5 ట్రిలియన్ మార్కును అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల్లో SBI 1 ట్రిలియన్ కంటే ఎక్కువ చెల్లింపులు చేసింది. కోవిడ్ -19 కారణంగా అన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ హైదరాబాద్ సర్కిల్ మాత్రమే రూ.10000 కోట్ల చెల్లింపులను దాటింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ ఈ వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్ సర్కిల్ రూ.44580 కోట్ల హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, హైదరాబాద్ సర్కిల్ రూ.8500 కోట్ల మొత్తంలో 19000 హోమ్ లోన్‌లను, రూ.1700 కోట్ల మొత్తంలో 9100 టాప్ అప్ లోన్‌లను మంజూరు చేసింది. SBI అన్ని వర్గాల అవసరాలకు సరిపోయే విస్తృత శ్రేణి ఉత్పత్తులను కలిగి ఉంది. SBI అందించే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.

కస్టమర్‌లు బ్యాంక్‌ని సందర్శించకుండానే హోమ్ లోన్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఆన్‌లైన్ కస్టమర్ అక్విజిషన్ సిస్టమ్ (OCAS) లాంటి డిజిటల్ సేవలను కూడా ప్రవేశ పెట్టింది. YONO యాప్‌ ద్వారా “ఇన్‌స్టా టాప్ అప్ లోన్”ని కూడా SBI అందిస్తున్నది. “రిటైల్ లోన్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్”, “డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్”  లాంటి అధునాతన సాఫ్ట్‌వేర్ లను SBI ప్రవేశపెట్టింది. వీటివల్ల మొత్తం డాక్యుమెంటేషన్ ప్రక్రియ డిజిటలైజ్ చేసినట్లు అయింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కోసం SBI నోడల్ ఏజెన్సీగా నియమించబడింది. గత 3 సంవత్సరాలుగా, PMAY కింద సుమారు 16000 రుణాలను మంజూరు చేసినట్లు చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ తెలిపారు.

Related posts

ఫర్ గాటెన్ ప్రామిస్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తూచ్

Satyam NEWS

అంగరంగ వైభవంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం

Satyam NEWS

దళిత బంధు కోసం పాకులాడటం మంచిది కాదు

Satyam NEWS

Leave a Comment