39.2 C
Hyderabad
May 3, 2024 12: 55 PM
Slider మహబూబ్ నగర్

ఆర్యవైశ్యుల పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

dsp kollapur

కొల్లాపూర్ పురపాలక పట్టణ కేంద్రంలో ఐదుగురు ఆర్యవైశ్యుల పై  ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొంపల్లి మురళి గౌడ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పట్టణ  కేంద్రం ఎన్టీఆర్ చౌరస్తాలో కురుమయ్య అనే దళిత వ్యక్తికి 30 గజాల స్థలం ఉన్నది. ఆయన 10 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

ఆ స్థలం పక్కన కాంప్లెక్స్ నిర్మాణం చేయాలనుకున్న కొందరు ఆర్య వైశ్యులు ఆ స్థలం మాది అంటూ అతని ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా ఆ స్థలం తీసుకుని ఆరు లక్షల ఇస్తామని ఎర వేశారు. అతనికి అమ్మడానికి ఇష్టం లేక అ స్థలంలో షాపు నిర్మాణం చేసుకోవడానికి కంకరా, ఇతర సామగ్రి ఉంచారు.

ఆ స్థలంలో అతను డబ్బా పెట్టుకున్నాడు. అయితే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయలనుకున్న కొందరు  ఆ డబ్బాను, సామాగ్రిని తొలగించారు. ఈ అంశంపై కురుమయ్య పోలీసులను  ఆశ్రయించారు.

ఎసై కొంపలి మురళి గౌడ్ కేసు నమోదు చేశారు. అయితే ఆ స్థలం కోర్టు లో ఉన్నది. ఇరువురు కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా గురువారం డిఎస్పి మనోహర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చుట్టూ పరిధిలో ఉన్న ప్రజలను ఎంక్వయిరీ చేశారు. స్థల వివరాలను పరిశీలించారు. బాధితులైన కురుమయ్యను స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు.

అనంతరం ఐదు గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ విషయం పై ఎస్ఐ కొంపల్లి మురళి గౌడ్  క్లారిటీ ఇచ్చారు. అయితే వారం రోజుల క్రితమే  ఆర్యవైశ్యుల పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం విచారణ కోసం డిస్పీ ఎంక్వయిరీ కి వచ్చినట్లు చెప్పారు.

Related posts

పత్తి రైతుల సమస్య పరిష్కారానికి జీఎస్టీ చైర్మన్ హామీ

Bhavani

తీరని ఆవేదన ఎవరితో చెప్పుకోలేక తనువు చాలించాడు

Satyam NEWS

ఎన్ ఏ సి శిక్షణ అభ్యర్ధులకు కుట్టుమిషన్ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శానంపూడి

Satyam NEWS

Leave a Comment