26.7 C
Hyderabad
April 27, 2024 09: 06 AM
Slider ముఖ్యంశాలు

ఎన్ ఏ సి శిక్షణ అభ్యర్ధులకు కుట్టుమిషన్ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శానంపూడి

#mlasanampudi

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఏ సి వారి ఆధ్వర్యంలో ఇస్తున్న కుట్టుమిషన్ శిక్షణ పూర్తైన అభ్యర్ధులకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్ధులకు మంగళవారం కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ స్కిల్  డవలప్మెంట్ కొర్సుల గురించి ఇంకా చాలా మంది మహిళలకు తెలియడం లేదని, వారందరికీ తెలియజేసి స్కిల్ డవలప్మెంట్ కోర్స్ ని ఇప్పించాల్సిన బాధ్యత మన అందరిదని అన్నారు.కుట్టు మిషన్ ఆనే సబ్జెక్టు ని అంత తేలికగా తీసుకోవద్దని,ఈ రోజుల్లో బోటిక్ ల ద్వారా లక్షల్లో టర్నోవర్ చేస్తున్న షాపులు కూడా ఉన్నాయని,ఏదైనా సరే నైపుణ్యం మీదనే ఆధారపడి ఉంటుందని, నేర్చుకోవాలి, అప్డేట్ కావాలి  అప్పుడే మార్కెట్ ని శాసించవచ్చు అన్నారు.

మహిళలు కుట్టుమిషన్ నేర్చుకొని షాప్ లు పెట్టి లేదా ఇంటివద్ద కుట్టడం ప్రారంభించి కొద్దీ పాటి సంపాదన ప్రారంభం అవుతే అప్పుడు ఆత్మవిశ్వాసం పెరిగుతుందని,కొద్దిపాటి సంపాదన ప్రారంభం నుండే గౌరవం కూడా తెచ్చిపెడుతుందని, ఎవరి మీదా ఆధారపడకుండా ఎవరికి వారికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లభిస్తుందని, అదే విధంగా ప్రతి ఈ విషయాన్ని డబ్బుతో ముడి పెట్టకుండా కమర్షియల్ గా ఆలోచించకుండా,జీవితంలో పైకి ఎదగాలని,కుట్టు మిషన్ నైపుణ్యంతో పాటు కస్టమర్ సర్వీస్ ని కూడా నేర్చుకుని అప్డేట్ కావాలని,అప్పుడే  రాణించ గలుగుతారని,ఈరోజు ఉన్న ఊర్లోనే ఎంత నేర్చుకున్నా మనకు అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఊరు దాటితేనే అవకాశాలు మెండుగా పెరుగుతాయని,అట్టి అవకాశాలను ఉపయోగించుకొని జీవితంలో పైకి ఎదగడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు.

మహిళలు,యువత నైపుణ్యంతో ఉంటేనే సమాజాలు,దేశాలు బలంగా ఉంటాయని,హుజూర్ నగర్ లో త్వరలోనే ఐటిఐ కళాశాల కూడా ప్రారంభించబోతున్నని,ఐదు ఎకరాల స్థలాన్ని కూడా చూసి రెడీగా ఉంచామని సైదిరెడ్డి తెలియజేశారు.అనంతరం కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమములో ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ  నాయకులు,ఎన్ ఏ సి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సత్యం న్యూస్ కథనంతో కదిలిన పోలీసు యంత్రాంగం

Satyam NEWS

మైనర్లు డ్రైవింగు చేయడంపై ప్రత్యేక డ్రైవ్…!

Satyam NEWS

పదవ తేదీ నుంచి జన సేవాదళ్ శిక్షణా శిబిరం

Bhavani

Leave a Comment