42.2 C
Hyderabad
May 3, 2024 18: 52 PM
Slider ఆదిలాబాద్

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు త్వరగా పరిష్కారం చేయాలి

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కారం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా ఎస్ పి సురేష్ కుమార్, అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్పేయి, రాజేశం, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధిత కుటుంబాలకు ఆసరాగా కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఆయా శాఖల ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. వీటి ద్వారా ఆర్థికంగా వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులు ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ, సబ్సిడీల కు సంబంధించిన పథకాలను వివరించాలని సూచించారు.

యువత చెడు దారిన నడవకుండా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉందని అన్నారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 234 కేసులు నమోదు కాగా 93 పెండింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 11 కేసులు భూములకు సంబంధించినవి ఉన్నాయని 36 కేసులు పరిష్కారం దిశగా చివరి స్థాయికి వచ్చాయని తెలిపారు.  అంతకుముందు ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా బెల్టుషాపులు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని అన్నారు.

అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యుల పై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావు, డిఎస్పి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సజీవన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని మణెమ్మ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు రేగుంట కేశవ్, అర్జు, బానోత్ గోపాల్, గణేష్, వెంకటేష్, శ్యామ్ రావు పాల్గొన్నారు.

Related posts

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన నటి త్రిష

Satyam NEWS

అందరి ముందు అద్భుతం ఆవిష్కరించిన ఆనందయ్య మందు

Satyam NEWS

రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా చిత్రం ఆద్య

Satyam NEWS

Leave a Comment