26.7 C
Hyderabad
May 15, 2024 10: 29 AM
Slider రంగారెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్లు లో రిజర్వేషన్ కల్పించాలి

#ravi

కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ హడావుడి గా ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లో జనాభా నిష్పత్తి ప్రకారం 50శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండగా 33శాతం రిజర్వేషన్ ను ఆమోదించిన తీరు సమంజసం గా లేదని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి విమర్శించారు. ఈ 33 శాతం మహిళా రిజర్వేషన్ లో యస్ సి, యస్ టి, బిసి జనాభా నిష్పత్తి ని కూడా చేర్చాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. సమాజం లో సగం భాగం అయిన మహిళలకు 50 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల లో ఇచ్చిన విధంగా చట్ట సభల్లో ఇవ్వక పోవటం ఓట్ల కోసం చేస్తున్న హడావిడి గా ఉంది తప్ప ఇది మహిళలకు ఇచ్చే రాజ్యాంగ హక్కులో బాగంగా లేదని అన్నారు.

ఇచ్చిన 33 శాతం మహిళా రిజర్వేషన్ లో కూడా యస్ సి, యస్ టి, బిసి కోటా రిజర్వేషన్ లేకపోతే మహిళలకు ఇచ్చిన ఈ రిజర్వేషన్ కు న్యాయం జరగదు అని, తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లు లో సామాజిక రిజర్వేషన్ జనాభా నిష్పత్తి ప్రకారం నిర్ణయం చేయాలని యంసిపిఐ(యు) డిమాండ్ చేస్తున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అనేక పోరాటాలు జరిగాయి అని 2010 పార్లమెంటు ఆమోదం అయినప్పటికీ ఇప్పటికీ ఆచరణలో విఫలం అయిన విధంగా కాకుండా వెంటనే అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని యంసిపిఐ(యు) డిమాండ్ చేస్తున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లు తో పాటు చట్ట సభల్లో బిసి రిజర్వేషన్ బిల్లు కూడా వెంటనే తీసుకుని రావాలని దాని కోసం కులగణన చేపట్టాలని యంసిపిఐ(యు) కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నది.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

కరోనా బాధితులకు ఐ సొల్యూషన్ కిట్ల పంపిణీ

Satyam NEWS

చింతూరు రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

Satyam NEWS

అధునాతన బోట్ల తో బాన్సువాడ మినీ ట్యాంక్ బండ్

Satyam NEWS

Leave a Comment