27.7 C
Hyderabad
May 11, 2024 08: 16 AM
Slider నిజామాబాద్

పండగలా ప్రారంభమైన పాఠ్యపుస్తకాల పంపిణీ

#School Books

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో  ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. బిచ్కుంద మండల కేంద్రంలో ఎంపీపీ అశోక్ పటేల్ పాఠ్య పుస్తకాలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా హజ్గుల్లో సర్పంచ్ మారుతి పటేల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు.

పిట్ల౦ మండలంలోని గౌరారం గ్రామంలో సర్పంచ్ అనసూయ శంకర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలలన్నీ మూత పడ్డ విషయం తెలిసిందే. దీంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఇళ్లకు పరిమితమయ్యే అవకాశమున్నది. ప్రభుత్వం ప్రచురించిన పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధుల చే పంపిణీ కార్యక్రమం చేపట్టింది.

దీంతో వారు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులతోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు హాజరయి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.  విద్యార్థులు  సామాజిక దూరం పాటిస్తూ పాఠ్య పుస్తకాలను తీసుకువెళుతున్నారని ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు.

Related posts

విజ‌య‌న‌గ‌రంలో ట్రాఫిక్ సిబ్బందికే ఝ‌లక్ ఇచ్చిన కేటుగాడు…!

Satyam NEWS

బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే…రోడ్ మీదకు కొత్త ఎస్పీ..!

Satyam NEWS

జూలై 12 న తెలంగాణకు ప్రధాని..!

Bhavani

Leave a Comment