29.7 C
Hyderabad
April 29, 2024 08: 31 AM
Slider నిజామాబాద్

పాఠశాల స్థలాన్ని కబ్జా చేసిన ముత్యంపేట మాజీ ఉప సర్పంచ్

#kamareddy

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్ పై ఆ గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామానికి చెందిన సుమారు 80 మంది గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. గ్రామానికి చెందిన కాటిపల్లి వెంకట రాంరెడ్డి పేరున 638/ఆ సర్వే నంబరులో ఉన్న 1.01 ఎకరాల భూమితో పాటు అదే గ్రామానికి చెందిన ఎం.అంజయ్య పేరున 638/ఆ సర్వే నంబరులో ఉన్న 1.10 ఎకరాల భూమిని 63 సంవత్సరాల క్రితం గ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారని గ్రామస్తులు పేర్కొన్నారు.

ఆ భూమి మధ్యలో నుంచి రోడ్డు, పాఠశాలకు స్థలం పోగా ఇప్పుడున్న 21 గుంటల భూమి పాఠశాలకు గ్రౌండ్ గా ఉపయోగిస్తున్నారని తెలిపారు. అయితే గ్రామ ఉప సర్పంచ్ గా ఉన్న సమయంలో తన భార్య ముత్తగారి రోజా పేరున 21 గుంటల భూమిని శిరీష్ గౌడ్ నకిలీ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని తెలిపారు. ఆ భూమి పహాని రికార్డులో పాఠశాల స్థలం పేరున ఉందన్నారు. ఈ విషయమై శిరీష్ గౌడ్ ను ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

గతంలో ఉప సర్పంచ్ గా ఉన్న సమయంలో ఇలాగే అక్రమాలకు పాల్పడితే పంచాయతీ పాలకవర్గం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి శిరీష్ గౌడ్ ను ఉపసర్పంచ్ పదవి నుంచి తప్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం పాఠశాలకు సంబందించిన స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగ ఫేక్ ఇంటి నంబర్లపై ఫేక్ అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. సంబంధిత డాక్యుమెంటులో కూడా ఎలాంటి సర్వే నంబర్ లేకుండా రిగిస్ట్రేషన్ చేసారన్నారు. సర్వే నంబర్లు లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పాఠశాల స్థలం కబ్జా విషయంలో గ్రామస్తులంతా ఒక్కటిగా ఉన్నారని, శిరీష్ గౌడ్ పై చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులంతా దాడి చేసే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ అదే జరిగితే గ్రామంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని, అలా జరగకుండా వెంటనే నిర్మాణాలను తక్షణమే ఆపించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Related posts

రేవంత్ రెడ్డి పాదయాత్రలో వనపర్తి నాయకులు

Satyam NEWS

`ఓదెల రైల్వేస్టేషన్`లో `స్పూర్తి`గా పూజిత పొన్నాడ‌ లుక్ విడుద‌ల‌

Satyam NEWS

అమర జవాన్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment