Slider నిజామాబాద్

పాఠశాల స్వచ్ఛ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలి

school workers

ప్రభుత్వ పాఠశాల లో స్వచ్ఛ కార్మికులుగా పని చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు నాగన్న డిమాండ్ చేశారు. ఆదివారం బిచ్కుంద మండల కేంద్రం మార్కెట్ కమిటి ఆవరణలోసి ఐ టి యు జుక్కల్ డివిజన్ కన్వీనర్ సురేష్ గొండ అధ్యక్షతన  బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పెద్ద కొడపగల్ మండలాలకు చెందిన పాఠశాల స్వచ్ఛ కార్మికుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా గత కొంత కాలంగా చాలీచాలని వేతనాలతో బతుకు వెళ్ళదీస్తున్న కార్మికుల బకాయి పడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని పనికి తగ్గ ఫలితం దక్కాలని అన్నారు. పాఠశాల స్వచ్ఛ కార్మికుల పై పాఠశాల అభివృద్ధి కమిటి చైర్మన్ ల వేధింపులు ఆగాలన్నారు. ప్రతి కార్మికునికి నెలకు 18వేల వేతనం ఇవ్వాలని అందరికి వైద్య సౌకర్యం కోసం ఇ ఎస్ ఇ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో నాయకులు కె. రాములు, మోతిరాం, గోవింద్ నాలుగు మండలాల పాఠశాల స్వచ్ఛ కార్మికులు, సి ఐ టి యు నాయకులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తిలో మహిళ హత్య

Bhavani

పేదలకు నిత్యావసర సరుకులు పంచిన ఎమ్మెల్యే బీరం

Satyam NEWS

మందుబాబులకు అడ్డాలుగా మారిన కంపోస్టు షెడ్ లు

Satyam NEWS

Leave a Comment