27.7 C
Hyderabad
April 30, 2024 10: 30 AM
Slider ముఖ్యంశాలు

అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గౌరవప్రదంగా ఉండాలి

#cpmkhammam

కేంద్రంలో పాలన కొససాగిస్తున్న బిజెపి మతోన్మాద రాజకీయాలు చేస్తూ దేశంలో శాంతియుతంగా, సామరస్యంగా వున్న ప్రజల మధ్య చిచ్చు పెడుతూ, మత ఘర్షణలు సృష్టిస్తూ దేశ సమైక్యతకు భంగం కల్పిస్తూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని అడ్డగోలు దారులు తొక్కుతూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న బిజెపి ని ఓడిరచేందుకు వామపక్ష, లౌకిక శక్తులు ఐక్యంగా పోరాడాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, బిఆర్‌ఎస్‌ సీట్ల సర్ధుబాటు గౌరప్రదంగా వుంటూ ఐక్యతతో బిజెపి కుట్రలను తిప్పికొట్టే విధంగా పనిచేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు.

ఖమ్మం సుందరయ్య భవనంలో వై.విక్రం అధ్యతన జరిగిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసిన బిజెపి ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకుండా కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు యిస్తామని చెప్పి, యింత వరకు అమలు చేయకుండా నిరుద్యోగులకు మొండిచేయి చూపించిందని విమర్శించారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి వాటిని అమలు చేయకుండా మరింతగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటే విధంగా ధరలు పెంచారని అన్నారు.

దీని కారణంగా ప్రజల జీవన పరిస్థితులు దుర్భరమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, రాష్ట్రాల అభివృద్ధికి నిధులను మంజూరు చేయకుండా గవర్నర్‌ ద్వారా బిల్లు పాసు కాకుండా అడ్డుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి బిజెపి రావాలని అనేక తప్పుడు మార్గాల ద్వారా బిజెపి ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇలాంటి సమయంలో బిజెపికి వ్యతిరేకంగా లౌకిక శక్తుల ఐక్యత చాలా అవసరమని అన్నారు. మత సామరస్యానికి వేదికగా వున్న తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలకు స్ఫూర్తిగా వున్న తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి చోటివ్వకుండా రాబోయే ఎన్నికల్లో బిజెపిని చిత్తు చిత్తుగా ఓడిరచి గుణపాఠం నేర్పాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకోసం వామపక్ష పార్టీలు యిప్పటికే జిల్లాలో కృషి చేస్తున్నాయని తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు బిఆర్‌ఎస్‌ పార్టీతో సమగ్రంగా చర్చించి సీట్ల సర్ధుబాటు ఉంటుందని నున్నా తెలిపారు. సిపిఎం, సిపిఐ, బిఆర్‌ఎస్‌ పార్టీలు చర్చలు చేసి పార్టీ బలమైన అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీచేస్తామని సర్ధుబాటులో ఏ పార్టీ ఎక్కడ నుండి పోటీ చేసినా, ఐక్యంగా ముందుకు పోతామని నున్నా తెలిపారు. బిజెపి మతోన్మాద కార్పొరేట్‌ శక్తులకు ఖమ్మం జిల్లాలో తగిన గుణపాఠం జిల్లా ప్రజలు చెబుతారని నున్నా నాగేశ్వరరావు అన్నారు.

Related posts

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

Satyam NEWS

అసలు విషయం చెప్పింది సత్యం న్యూస్ ఒక్కటే

Satyam NEWS

Talking Point: జగన్ ప్లేస్ లో నేనే కనుక ఉంటే….

Satyam NEWS

Leave a Comment