30.7 C
Hyderabad
April 29, 2024 06: 44 AM
Slider నల్గొండ

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

#hujurnagar

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో వివిధ కార్మిక సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు సమావేశమయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ నెల 28,29 తేదీలలో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ భవన సముదాయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, సి ఐ టి యు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు,ఎ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి మెకల శ్రీనివాస రావు,సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి పాల్గొని మాట్లాడుతూ 2014 నుండి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పేదల జీవితాలు దుర్భర స్థితిలోకి నెట్టి వేయబడ్డాయని అన్నారు. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, దేశంలో 40 లేబర్ కోడులను 4 కోడులుగా కుదించటం కార్మిక లోకానికి తీరని ద్రోహం చేసిందిగా భావించాలని అన్నారు.

కరోనా సమయంలో నిరుద్యోగ యువత రెండు కోట్ల ఉద్యోగాలను కోల్పోయారని,ఎన్ డి ఏ ప్రభుత్వం పేద కార్మికుల పొట్ట కొట్టడమే తప్ప కార్మికులకు,పేదలకు భరోసా కల్పించలేక పోయిందని తీవ్రంగా ఆరోపించారు.ప్రభుత్వ నిరంకుశ మొండి వైఖరికి నిరసనగా 10 కార్మిక సెంట్రల్ యూనియన్లు ఈనెల 28,29 తేదీలలో బందును,నిరసనలను, గ్రామీణ స్థాయిలోకి తీసుకువెళ్ళాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎ ఐ టి యు సి నాయకుడు జడ శ్రీనివాస్,ఐ ఎన్ టి యు సి నాయకుడు బెల్లంకొండ గురవయ్య,టి ఆర్ కె వి నాయకుడు పచ్చిపాల ఉపేందర్,ఐ ఎఫ్ టి యు నాయకుడు యాకూబ్,జి.కరుణాకర్ రెడ్డి,సయ్యద్ ముస్తఫా,పాశం రామరాజు,ముక్కంటి,యల్క సోమయ్య గౌడ్,రాంబాబు,ఇందిరాల వెంకటేశ్వర్లు,జెట్టి ప్రసాద్,పి.రాములు, చప్పిడి సావిత్రి,గడ్డం వెంకటమ్మ,షేక్ హుస్సేన్,కె.వెంకటరెడ్డి,పి.గురవయ్య, ఆర్.రాము,సిహెచ్.రాము తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

దయచేసి మనిషికి మూడు చెట్లు నాటండి

Satyam NEWS

పెద్ద సినిమాలకు మళ్లీ పొంచిఉన్న కరోనా గండం

Satyam NEWS

హోలీ సంబరాల్లో కలెక్టర్

Murali Krishna

Leave a Comment