29.7 C
Hyderabad
May 4, 2024 06: 28 AM
Slider ఖమ్మం

రెండవ ఏఎన్ఎం ల సమస్యలు పరిష్కరించాలి

#ANM strike

తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న రెండవ ఏఎన్ఎం ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోర్టు ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండో ఏఎన్ఎంల సమ్మె కేంద్రాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్య అయినా పరిష్కారం అయిందంటే అది కేవలం పోరాటం వల్లనే అన్నారు. భారతదేశం వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసే విజయం సాధించారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

దేశంలోనే మొట్టమొదటి కార్మిక సంఘంగా కార్మిక పోరాటాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఏఐటియుసిని ఎంపిక చేసుకోవడం మంచి విషయం అన్నారు. ఎటువంటి పరీక్షలు లేకుండా బే షరతుగా రెగ్యులర్ చేయాలన్న సెకండ్ ఏఎన్ఎం లో డిమాండ్ న్యాయబద్ధమైందన్నారు. 16 సంవత్సరాలు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తూ ప్రభుత్వం ఇచ్చే టార్గెట్లను పరిపూర్తి చేస్తూ మరలా చదువుకొని పరీక్ష రాయడం అనేది సాధ్యం కాని విషయం అన్నారు.

జీవితం మొత్తం ప్రభుత్వం కోసమే పనిచేస్తున్న ప్రభుత్వాలు పని చేయించుకుంటున్నాయి కానీ వారి జీవితాలను బాగు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సెకండ్ ఏఎన్ఎం ల పోరాటానికి ఏఐటీయూసీకి తోడుగా సిపిఐ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగ్ నరసింహారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ కార్యదర్శి సిహెచ్ సీతామహాలక్ష్మి, రెండో ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బడేటి వనజ, ఆర్గనైజింగ్ కార్యదర్శి సిహెచ్ విజయ కుమారి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి జయమ్మ, శీలం నాగశేషమ్మ రాష్ట్ర నాయకురాలు లతకుమారి తదితరులు పాల్గొన్నారు.

Related posts

గంప రాజమ్మకు అశ్రునివాళి

Satyam NEWS

దొరికిన సొమ్ము ఎవరైనా ఇస్తారా?…. ఇతను ఇచ్చాడు

Satyam NEWS

బార్లు తెరిచేస్తున్నారు రండి కరోనా పంచుకుందాం

Satyam NEWS

Leave a Comment