29.7 C
Hyderabad
May 3, 2024 03: 37 AM
Slider ఆంధ్రప్రదేశ్

రివెంజ్ పాలిటిక్స్: జెసి దివాకర్ రెడ్డి భద్రత తొలగింపు

jc diwakar reddy

జె సి దివాకర్ రెడ్డిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం లక్ష్యంగా ఇప్పటికే ఆయన ఆస్తులపైనా, వ్యాపారాలపైనా దాడులు చేశారు.

జేసీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేయడంతో పాటు, జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూముల రద్దుతో పాటు ఇతర కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రధాన అనుచరులపైనా పోలీసులు కేసులు పెట్టడం, పీడీయాక్ట్‌లు పెట్టి నెలల తరబడి పోలీస్‌స్టేషన్‌లో ఉంచడం జరిగింది.

తాజాగా జేసీ దివాకర్‌రెడ్డికి భద్రతను ప్రభుత్వం తొలగించింది. గతంలో గన్‌‌మెన్‌లను 2+2 నుంచి 1 + 1 కు తగ్గించిన జగన్ ప్రభుత్వం తాజాగా పూర్తి భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు గత రాత్రి జేసీ దివాకర్‌రెడ్డికి భద్రత తొలిగిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జేసీకి భద్రత తొలగింపు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. జేసీకి భద్రతను తొలగించడం పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జేసీ కుటుంబంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహిస్తున్నారు.

Related posts

రుణాలపై క్లారిటీ ఇవ్వనున్న అదానీ గ్రూప్

Satyam NEWS

జర్నలిస్టుపై చేసిన వ్యాఖ్యలను యూట‌ర్న్‌

Sub Editor

గోవిందా… గోవిందా: మళ్లీ రమణ దీక్షితుల ఆక్రోశం

Satyam NEWS

Leave a Comment