Slider ప్రత్యేకం

ఎండ ముదురుతున్నా ఆగని సీతక్క ప్రయాణం

#Seetakka

పైన మండే ఎండ… కింద కాలే బండ… అయితేనేం సీతక్క ప్రయాణం ఆగడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేదానితో సంబంధం లేకుండా తన వంతు సాయం అందిస్తూనే ఉన్నారు ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ ఎలియాస్ సీతక్క. లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి అడవి నుంచి బయటకు రాలేక, రోజు కూలి చేసుకోలేక అల్లాడుతున్న గిరిపుత్రులకు ఆమె సాయం అందిస్తూనే ఉన్నారు.

ముందు అడవి బిడ్డల ఆకలి తీర్చుందుకు ఆమె విశేషంగా కష్టపడుతున్నారు. వాహనాలు కూడా వెళ్లలేని అడవి పల్లెలకు ఆమె నిత్యావసర వస్తువులు స్వయంగా మోసుకుంటూ వెళుతున్నారు. ములుగు నియోజకవర్గంలోని గోండులకు, గిరిజనులకు లాక్డౌన్ వలన పనులు లేక తినడానికి తిండి లేని వారికి సీతక్క సహయం చేస్తున్న తీరు యావత్తు దేశంలోని ఎమ్మెల్యేలకు ఆదర్శం.

Related posts

నో ఎస్క్యూజ్:కూతుర్ని రేప్ చేసి త‌ల్లిని కొట్టి చంపేశారు

Satyam NEWS

మంత్రి మేకపాటి ఎలా మరణించారంటే…..

Satyam NEWS

సెకండ్ వేవ్ ను ఎట్టిపరిస్థితుల్లో రానివ్వవద్దు

Satyam NEWS

Leave a Comment