26.7 C
Hyderabad
April 27, 2024 08: 57 AM
Slider మహబూబ్ నగర్

వాట్సప్ గ్రూప్ అడ్మిన్ లకు హెచ్చరిక

kollapur police

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రజలకు నాయకులకు సూచనలు ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ కు సంబంధించిన ముఖ్య అంశాలపై కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి మాట్లాడారు. రాజకీయ నాయకులు అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని చెప్పారు. అదేవిధంగా మైక్ సౌండ్, మీటింగ్ లకు ముందోస్తుగా అనుమతులు ఉండాలన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

గ్రూపులను ఓన్లీ అడ్మిన్ ఆపరేట్ చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. రాజకీయపరమైన వ్యక్తిగతంగా చాటింగ్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని దానికి గ్రూప్ అడ్మిన్ లు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు.  శాంతిభద్రతలకు భంగం  కలిగించ రాదని వెంకట్ రెడ్డి చెప్పారు. బెల్టు షాపులపై నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడ బెల్టు షాపులు హోటల్స్ లో సిట్టింగ్ లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సిఐ బి.వెంకట్ రెడ్డి తెలియజేశారు.

Related posts

గెలిచేవారికి మాత్రమే మునిసిపల్ టిక్కెట్లు

Satyam NEWS

అమరావతి ఆడబిడ్డలు ఈ ఉద్యమానికి ఒక స్పూర్తి

Satyam NEWS

కెసిఆర్ కు పువ్వాడ జన్మదిన శుభాకాంక్షలు

Bhavani

Leave a Comment