29.7 C
Hyderabad
May 1, 2024 03: 50 AM
Slider ఆధ్యాత్మికం

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం

#ontimitta

అన్నమయ్య జిల్లాలోని రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో పౌర్ణమి సందర్భంగా కోదండరాముని కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు శ్రావణ్ స్వామి పవన్ స్వామి వేద పండితులు రామాలయ రంగ మండపములు వేదికను ఏర్పాటు చేసి సీతారాముల ఉత్సవమూర్తులను వేరువేరుగా కొలువు తీర్చారు.

అనంతరం సీతారాములను సుగంధ ద్రవ్యాలతో పాలు పెరుగు తేనె నెయ్యి, కొబ్బరి నీళ్లు తో అభిషేకం నిర్వహించారు. టీటీడీ వారు ఏర్పాటు చేసిన నూతన పట్టు వస్త్రాలను స్వామివారికి సీతామాతకు అలంకరించి తులసి గజం మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రావణ స్వామి పవన్ స్వామి కోదండ రామస్వామికి సీతామాతకు వైభవంగా పౌర్ణమి కళ్యాణం నిర్వహించారు.

భౌతిక దూరం పాటిస్తూ రాములు కళ్యాణాన్ని భక్తులు తిలకించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు సీతారాముల వారికి కళ్యాణం నిర్వహించడం భక్తులందరికీ తెలిసిన విషయమే. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు భక్తులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు.

Related posts

బాసరలో ఘనంగా ప్రారంభమైన వసంత పంచమి

Satyam NEWS

ముందే ఎన్నికలు వస్తాయి: చంద్రబాబు

Satyam NEWS

కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న రేషన్ బియ్యం వ్యాపారులు

Satyam NEWS

Leave a Comment