24.2 C
Hyderabad
July 20, 2024 19: 01 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ రాజకీయ చాణక్యుడు ఇక లేరు

ratna Prabhakar reddy

కొల్లాపూర్ రాజకీయాలలో చాణక్యుడు లాంటి వ్యక్తి ఇక లేరు. సీనియర్ నాయకుడు రత్న ప్రభాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురువారం నాడు మహబూబ్ నగర్ లోని తన సొంత నివాసం క్రిస్టియన్ పల్లి నుండి యాక్టివా వెహికల్ పై వెనుక కూర్చొని వస్తుండగా రత్న ప్రభాకర్ రెడ్డి ప్రమాదానికి గురయ్యారు.

ఎక్సైజ్ శాఖ వాహనం వెనక నుండి ఢీకొనడంతో తల వెనక భాగంలో గాయం కావడంతో మహబూబ్ నగర్  ఎస్విఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి బంజారాహిల్స్ సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన కోలుకోలేకపోయారు. చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదు.

బీపీ డౌన్ అయి రాత్రి తుది శ్వాస వదిలినట్లు అధికారికంగా వైద్యులు తెలియచేయడంతో ఒక్కసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్యకర్తలు,నాయకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో క్రిస్టియన్ పల్లి తన స్వగృహం దగ్గర గంట సేపు పార్థివదేహాన్ని ఉంచుతారు.

 ఆ తర్వాత కొల్లాపూర్ మండలం రత్న ప్రభాకర్ రెడ్డి స్వగ్రామమైన మాచినేని పల్లి గ్రామ గ్రామంలో అంతక్రియలు నిర్వహిస్తారని తెలిసింది. అంతకుముందు జ్యోతిరావు పూలే విగ్రహం నుండి  కొల్లాపూర్ పురవీధుల గుండా అంతిమయాత్ర ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతిమ యాత్రకు మంత్రులు హాజరు అవుతున్నట్లు తెలిసింది.

రత్న ప్రభాకర్ రెడ్డి మంచిగా మాట్లాడి కార్యకర్తలను ఆకట్టుకునేవాడు. ఎందరికో సాయం చేసే మనస్తత్వం ఉన్న నాయకుడు కావడంతో అందరూ ఆయనను ఇష్టపడేవారు. నిజాలు వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులను ఆయన అభినందించేవాడు. గత శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర పోషించారు.

బీరం హర్షవర్ధన్ రెడ్డి గత  ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ విషయంలో రాష్ట్ర నాయకులతో సంబంధాలను కలుపుకొని టికెట్ విషయంలో ఎంతో కృషి చేశాడు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల విషయానికి వస్తే రత్న ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గెలుపులో హర్షవర్ధన్ రెడ్డి కి పెద్దన్నలా రత్న ప్రభాకర్ రెడ్డి వున్నాడు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, రత్న ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ విషయంలో ఒకే ఆలోచనతో పని చేసేవారు.

గత ఎంపీపీ ఎన్నికలో మహిళ రిజర్వేషన్ రావడంతో తనవర్గానికి చెందిన వారిని ఎంపిటీసీలు గా గెలిపించుకున్నారు. ఆ ఎన్నికల సమయంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో సంబంధాలు కలుపుకొని తన భార్య గాదెల సుధారాణి ఎంపీపీ గా చేశారు. నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి రత్న ప్రభాకర్ రెడ్డి.

 తన సతీమణి ఎంపిపి అయిన తర్వాత కొల్లాపూర్ మండల పరిధిలోని  ఎక్కడ అవినీతికి తావులేకుండా  సర్పంచ్ ఎంపిటిసిలు వార్డు మెంబర్లు ఎవరితో ఎక్కడ సమస్యలు వాటిల్లకుండా సమస్య పరిష్కారానికి కృషి చేసేవారు. స్వేచ్చ భావంతో పనిచేయాలని ప్రతినాయకుడికి చెపుతూ వచ్చేవారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, రత్నప్రభాకర్ రెడ్డి ఇద్దరు అన్న దమ్ముల కలిసిపోయ్యేవారు. అలాంటి నాయకుడు దూరం కావడం కొల్లాపూర్ ప్రాంతానికి తీరని లోటు.

Related posts

వసంత పంచమికి టీఎస్‌ఆర్టీసీ 108 ప్రత్యేక బస్సులు

Satyam NEWS

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం

Satyam NEWS

కల్వర్టును ఢీకొన్న బైక్ తో మహిళ మృతి

Satyam NEWS

Leave a Comment