హరితహారం ప్రాధాన్యతను అందరూ గుర్తించాలి ప్రతి ఒక్కరు హరితహారం లో పాల్గొని పర్యావరణ ను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మేడిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో ఆయన నేడు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవ్వాళ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. నాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర గుప్తా గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. నేను 3 మొక్కలు నాటను మరో ముగ్గురు ఎపి సీఎస్ నీలం సహాని, స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి,పీసీసీఎఫ్ శోభ లకు ఛాలెంజ్ చేస్తున్నాను అని ఆయన అన్నారు.
తనకు గ్రీన్ ఛాలెంజ్ చేసిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. ఇవ్వాళ ఆయన జన్మదినం రోజు ఇక్కడ మొక్కలు నాటడం సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త, అటవీశాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి, అటవీ సంరక్షణ శాఖ ప్రధానాధికారిని శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి, ఇగ్నటింగ్ మైండ్స్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.