31.2 C
Hyderabad
May 2, 2024 23: 58 PM
Slider కడప

డబ్బు ఉన్న వారికి దాన గుణం లేదు:మేడా బాబు

#nandaluru

నందలూరులో కోటాను కోట్లు సంపాదించే వారు ఉన్నారని వారికి దాన గుణం లేదని తనకి దేవుడు డబ్బు ఇచ్చే కొద్దీ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఉంటానని రాజంపేట యువ నాయకుడు మేడా విజయ శేఖర్ (మేడా బాబు) తెలిపారు. అన్నమయ్య జిల్లా నందలూరులో స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ ఓపెన్ రోవర్స్ సౌత్ గ్రూప్ ,సుభాష్ చంద్రబోస్ స్కౌట్ గ్రూప్ ఓపెన్ యూనిట్ సౌత్ సెంట్రల్ రైల్వే 24వ వార్షికోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 24 సంవత్సరాలు గా సామ్రాజ్ చేస్తున్న సేవా కార్య క్రమాలకు తన వంతు సహాయం ఉంటుందని,తనను చూసి మరి కొందరు ముందుకు వచ్చి సహాయ పడతారనే ఆశ తనకు ఉందని అన్నారు. ఈ సందర్భంగా తన వంతు సహాయం గా 10 వేల రూపాయలను వేదికపై ప్రకటించి వేపగుంట సామ్రాజ్ కు హర్ష ద్వానాల మధ్య అందజేశారు.రైల్వే మెడికల్ సూపర్నిడెంట్ జయ బాస్కర్ రావు మాట్లాడుతూ నందలూరు రైల్వే కళా క్షేత్రానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని అందులో స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ ఓపెన్ రోవర్స్ సౌత్ గ్రూప్ సామ్రాజ్ క్రమం తప్పకుండా 24 వార్షికోత్సవాలు జరుపుకోవడం సంతోష కర మన్నారు.

నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకి మేడా విజయ శేఖర్ రెడ్డి లాంటి వారి లాగా ముందుకు వచ్చి సహాయ సహాకారాలు అందిస్తే ప్రోత్సహకరంగా ఉంటుందని కోరారు.ఈ కార్యక్రమానికి ముందు మథర్ థెరిస్సా చిత్ర పటానికి పూల మాల వేసి క్యాండిల్స్ వెలిగించారు.న్యాయవాది ఆనందకుమార్ వ్యాఖ్యతగా వ్యవహరించారు.వివిధ రంగాల్లో సామాజిక సేవలో ఉత్తమ సేవ అవార్డులు, పురస్కారాలు, మరియు సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా మాజీ ఎంపిటిసి వేలు మలై,స్కౌట్ ప్రెసిడెంట్ కమల్ భాష,వైసీపీ నేత భాస్కరయ్య, సీనియర్ పాత్రికేయులు దార్ల శ్రీను వాసులు ఆచారి, వార్త రిపోర్టర్ చల్లా సురేంద్ర బాబు,టీవీ పురం యూత్ తగుతర నాయకులు, కార్యకర్తలు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. రాజంపేట యువ నాయకుడు మేడా విజయ శేఖర్ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. వేదికపై బాలబాలికల చేసిన సినీ నృతప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Related posts

అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ వాయిదా

Sub Editor

హమ్మయ్య, సీఎం కేసీఆర్ మళ్లీ వచ్చిండు

Satyam NEWS

క‌ల‌క‌లం సృష్టిస్తున్న యువ‌తి మృత‌దేహం…!

Satyam NEWS

Leave a Comment