37.2 C
Hyderabad
May 6, 2024 21: 48 PM
Slider నెల్లూరు

రోటరీ క్లబ్ 3160 డిస్ట్రిక్ట్ గవర్నర్ చే మహిళలకు కుట్టు మిషన్ల పంపిణి

#Rotaryclub

నెల్లూరు జిల్లా వెంకటగిరి రోటరీ క్లబ్ ప్రత్యేక సమావేశం శుక్రవారం సాయంత్రం స్థానిక శ్రీ వి.ఆర్. జె. సి మహిళా డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది.

ఈ సందర్భంగా వెంకటగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు బి.కె.ప్రసాద్ “వెంకటగిరి సామాన్యుడు” సోషల్ మీడియాతో మాట్లాడుతూ… రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ (3160) గవర్నర్ పరిధిలో కర్ణాటక లోని 8 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉన్నాయన్నారు.

డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏడాది కాలంలో రోటరీ డిస్ట్రిక్ట్ పరిధిలోని 12 జిల్లాల్లో పర్యటిస్తారని, అందులో భాగంగా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బి. చిన్నపరెడ్డి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రతాప్ రెడ్డి వెంకటగిరి వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాల గురించి రోటరీ క్లబ్ అధ్యక్షులు బి.కె.ప్రసాద్ వివరించారు.

కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఐదుగురు మహిళలకు… అతిధుల చేతులమీదుగా ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులతో పాటు వెంకటగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు  బి.కె.ప్రసాద్, మాజీ అధ్యక్షులు పర్వతాల బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ చల్లా మల్లికార్జున రావు, కోశాధికారి గుండు సుధాకర్, సభ్యులు చిరువెళ్ల ప్రభాకర్,  సుధాకర్ నాయుడు, కుట్టు మిషన్ల లబ్ధిదారులైన మహిళలు పాల్గొన్నారు.

కె.రమాకాంత్, వెంకటగిరి సామాన్యుడు

Related posts

నోటీసులకు భయపడం ఉద్యమాన్ని ఆపం: ఏఐటియుసి

Satyam NEWS

సునర్ బౌలి లో మోడల్ పార్క్ అభివృద్ధి

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రంలోని ట్రాఫిక్ స‌మ‌స్య‌పై స్థానిక‌ ఎమ్మెల్యే స‌మాలోచ‌న‌లు

Satyam NEWS

Leave a Comment