21.7 C
Hyderabad
December 2, 2023 04: 14 AM
Slider నిజామాబాద్

ఉద్యమకారులు రోడ్డుపై.. ద్రోహులు మంత్రివర్గంలో..

తెలంగాణ ఉద్యమకారులు రోడ్డు మీద ఉంటే ద్రోహులు మాత్రం మంత్రివర్గంలో ఉన్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. మంత్రులు ఏ పని చేయాలన్నా కెసిఆర్ దిశా నిర్దేశంతోనే పని చేయాల్సిందేనన్నారు. కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్ భవనంలో నిర్వహించిన ‘ఉద్యమకారులరా.. కలిసి మాట్లాడుకుందాం రండి.. రౌండ్ టేబుల్ సమావేశం’ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాగాంధీకి తెలంగాణ ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా ఉన్నానని తెలిపారు. తెలంగాణ ఆవశ్యకతను సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లకు వివరించి తెలంగాణ ఇప్పించేలా ఒప్పించానన్నారు. అలాంటి తెలంగాణలో ప్రస్తుతం గడీల పాలన నడుస్తుందన్నారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో మంత్రులకు అనేక రకాలు స్వేచ ఇచ్చి వాళ్ళు చెప్పిన నిర్ణయాలు వినేవారని, ప్రస్తుతం మంత్రులకు ఏ పని చేయాలన్నా స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు.

1969 నుంచి కామారెడ్డి ఉద్యమాలకు పెట్టింది పేరన్నారు. అప్పట్లో అడ్డుర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలంగాణ పోరాటం చేసి ప్రాణాలు వదిలారని, అలాంటి గడ్డమీద మాయలు చేసే కేసిఆర్ వస్తున్నాడని, ఇక్కడ ప్రజలు ఉద్యమస్ఫూర్తిగా కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవకాశం వచ్చింది అన్నారు. ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు.

చేసిన తీర్మానాలు

  1. కెసిఆర్ పై పార్టీలకతీతంగా ఉమ్మడి అభ్యర్థిని నిలుపాలి. నియంత పాలన అంతమొందించాలి.
    2.నూతనంగా ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీకి సొంత భవనాన్ని అన్ని సదుపాయాలతో నిర్మించాలి.

3.ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 21, 22 పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలి.

4.గతంలో కామారెడ్డి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామన్నారు. అందులో భాగంగా ఒక ఇంజనీరింగ్ కళాశాల, బీఎడ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, ఐటిఐ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలి.

5.బిసి, ఎస్సి, ఎస్టి హాస్టల్ నూతన భవనాలు నిర్మాణానికి ఎదురు మంజూరు చేయాలి.

6.అన్ని రకాల కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయ పోస్టులను రెగ్యులరైజ్ చేయాలి

7.రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. నల్లబెల్లం పై ఆంక్షలు ఎతివేయాలి

8.ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

9.ఇవన్నీ చేశాకే కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేయాలి

Related posts

స్థానిక ఎన్నికలలో సంచార జాతులకు రిజర్వేషన్ ఇవ్వండి

Satyam NEWS

హాపీ బర్త్ డే నాన్న:మొక్కలు నాటిన కేటీఆర్ కవిత

Satyam NEWS

కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!