31.7 C
Hyderabad
May 2, 2024 08: 37 AM
Slider సంపాదకీయం

స్కిల్ కేసులో బదులే రాని ప్రశ్నలు ఎన్నో

#chandrababu

స్కిల్ కేసులో అవినీతికి పాల్పడ్డారన్న అభియోగంతో విపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడును అరెస్టు చేసి, జైలు పంపించారు. ఆయన అందులో అపరాధి అని, తన ముందున్న సాక్ష్యాల మేరకు కోర్టు నమ్మితే, బాబును కచ్చితంగా శిక్షిస్తుంది. సరైన ఆధారాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపించకపోతే.. బెయిల్ ఇవ్వడమో, లేదా బాబు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్‌ను సమర్ధించి, కేసును క్వాష్ చేయడమో చేస్తుంది. ఇవన్నీ కోర్టులో తేలాల్సిన అంశాలు.

అవినీతికి పాల్పడిన ఎవరినైనా శిక్షించాల్సిందే. దానిని ఎవరూ వ్యతిరేకించరు. కానీ.. విచారణ సంస్థలు ఆ మేరకు చిత్తశుద్ధితోనే విచారణ నిర్వహించారా? లేక పైవారి కళ్లలో ఆనందం కోసం విచారించారా? అన్నదే ముఖ్యం. ప్రభువులను పరమానందపరిచే తొందరలో తప్పుకాలేస్తే, సహజంగా అది రచ్చ లాంటి చర్చ అవుతుంది. ఇప్పుడు ‘స్కిల్’ కేసులో సరిగ్గా అదే జరుగుతోందన్నది, విపక్షాలు, ప్రజాస్వామ్యవాదుల విమర్శ. ఆ మేరకు చంద్రబాబు అరెస్టు తర్వాత సంధిస్తున్న సందేహాస్త్రాలు.. ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ చర్చలాంటి రచ్చేమిటో ఓసారి చూద్దాం.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సందేహాలకు దొరకని సందేహాలెన్నో ఉన్నాయి. ఉదాహరణకు తన పేరుతో కేసు పెట్టడం అసమంజసమంటున్నారు పివి రమేష్.

విధాన నిర్ణయం లో సీఎంను అరెస్టు చేయడం అసంబద్ధమని రమేష్ అంటున్నారు.

శాఖల నిర్ణయాలతో సీఎంలకు ఏం సంబంధమన్న ప్రశ్న

ఇంతకూ కుంభకోణం సొమ్ము ఏ అకౌంట్లలోకి వెళ్లిందో తేల్చరేం? అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు అకౌంట్‌లోకి నిధుల వెళితే ఆ వివరాలు వెల్లడించరేం?

షెల్ కంపెనీల అకౌంట్లు సీజ్ చేశారా?

మరి షెల్ కంపెనీల యజమానులను అరెస్టు చేయలేదేం?

సీమెన్స్ ప్రతినిధిని కేసులో ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదు?

ఐఏఎస్ ప్రేంచంద్రారెడ్డి, అజయ్‌కల్లంరెడ్డి ప్రస్తావనేదీ?

వారిని సీఐడీ, ఏసీబీ అరెస్టు ఎందుకు చేయలేదు?

ప్రేంచంద్రారెడ్డి లేఖలను సిట్ పరిశీలించిందా?

కనీసం సాక్షిగా కూడా ఆయనను చేర్చలేదెందుకు?

క్యాబినెట్ ప్రతిపాదన పంపిన అజయ్‌కల్లం రెడ్డిని విస్మరించారేం?

స్కిల్ కేసులో వారిద్దరి పాత్ర లేదని ఎలా నిర్థారించారు?

సెలక్షన్ కమిటీలోని రావత్, ఉదయలక్ష్మిని విచారించారా?

అప్పటి స్కిల్ శిక్షణపై ఎంపీ అర్జా శ్రీకాంత్ ఇచ్చిన ప్రశంసపై విచారించరేం?

తమకు పనిముట్లు రాలేదని ఏ శిక్షణా సంస్థలైనా ఫిర్యాదు చే శాయా?

సీఎంపై కేసుపెడితే సీఎస్, అప్పటి సెక్రటరీలపైనా కేసు పెట్టరేం?

జగన్‌పై ఏసీబీ కేసులో ఆయన న్యాయవాది అదే వాదించారు కదా?

ఇంతకూ డీఐజీ రఘురామిరెడ్డి ఏ హోదాలో కేసు పర్యవేక్షిస్తున్నారు?

ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. అయినా వీటికి సమాధానం దొరకడం లేదు. అదే ట్రాజెడీ.

Related posts

యూరియా కోసం రైతుల పడిగాపులు

Satyam NEWS

రాజకీయాల్లో నైతిక విలువలు లేని నల్లపురెడ్డి

Satyam NEWS

సింహాచలం దేవస్థానం ఈవోపై బదిలీ వేటు

Satyam NEWS

Leave a Comment