33.7 C
Hyderabad
April 29, 2024 23: 02 PM
Slider నల్గొండ

అర్హులైన ముస్లిం సోదరులకు దుకాణాలు కేటాయించాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉస్మానియా మసీద్ వక్ఫ్ షాపింగ్ కాంప్లెక్స్ లోని దుకాణాలలో డిఫాల్టర్సును తొలగించి అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ముస్లిం సోదరులు తహసిల్దార్ జయశ్రీ కి మంగళవారం వినతి పత్రం అందజేశారు. అద్దెలు చెల్లించే స్థోమత లేనప్పుడు వారికి దుకాణాలు ఎందుకని ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు మహ్మద్ అజీజ్ పాషా,అబ్దుల్ రహీం పాషా,షేక్ మన్సూర్ అలీ ప్రశ్నించారు.

వాస్తవానికి దుకాణాదారులు కొంతమంది సబ్ లీజ్  కు ఇచ్చుకుంటూ వేల రూపాయలు సంపాదించుకుంటున్నారని, దీనితో మసీదులో పనిచేసే సిబ్బంది జీతభత్యాలు మెయింటెనెన్స్,అభివృద్ధి కుంటుపడిందని,  వక్ఫ్ బోర్డుకు రావాల్సిన ఆదాయానికి కూడా భారీ స్థాయిలో గండి పడుతుందని వారు తెలిపారు. హుజూర్ నగర్ పట్టణంలో నడిబొడ్డున ఉన్న స్థానిక ఉస్మానియా మసీద్ వక్ఫ్  షాపింగ్ కాంప్లెక్స్ నూతనంగా అద్దెలు పెంచుతూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు (సి.ఇ.ఓ) ది.21.2.2022న,ఆర్డర్లు జారీ చేశారని, ఈ షాపింగ్ కాంప్లెక్స్ కిరాయి దారులు ఆ ఆర్డర్లను తీసుకొని సుమారు నాలుగు నెలలు కావస్తున్నప్పటికీ నూతన అద్దెకు చెల్లించలేదని అన్నారు.

ఉత్తర్వుల ప్రకారం టర్మ్ కండిషన్స్ మూడు నెలలు దాటితే డిఫాల్టర్లుగా గుర్తించి తొలగించాలని ఆర్డర్లో ఉన్నదని, కొంతమంది వక్ఫ్ బోర్డు అధికారులు ఈ కిరాయి దళారులతో కుమ్మక్కై వక్ఫ్ బోర్డు సి.ఈ.ఓ ఆర్డర్ అమలుచేయకుండా బేఖాతరు చేస్తున్నారని అన్నారు. తక్షణమే సిఈవో ఇచ్చిన ఉత్తర్వులను అమలు జరిపేందుకు వక్ఫ్ బోర్డు   ఉన్నతాధికారులతో సమస్యను వివరించి ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలుచేసి దుకాణాలలో వున్న డిఫాల్టర్స్ ను తొలగించాలని కోరారు.

కిరాయిల పెంపు ఏవిధంగా జరిగిందో పూర్తి స్థాయిలో క్లుప్తంగా వివరించటం జరిగిందని,సున్నితమైన అంశాన్ని జఠిలం చేయొద్దు అని తహసిల్దార్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ బిక్కన్ సాహెబ్, మహ్మద్ బిల్లు రహీమ్,పఠాన్ గౌస్ ఖాన్,లైటింగ్ జానీ,కారు మీరా,ఇబ్రహీం, మజీద్, రసూల్, వంట జానీ, మేస్త్రీ సైదా, సిరాజ్, దస్తగిరి,ముస్తఫా,ఖలీల్ నయీమ్, జానీపాషా,మొయిన్,మక్సూద్,సలావుద్దీన్, సలీం బాబా తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మునావర్ ఫారూఖీ వంటి మూర్ఖుడిని తెలంగాణలో అడుగు పెట్టనీయం

Satyam NEWS

ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్రోషం చూపిస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేసేందుకు పటిష్టమైన చర్యలు

Satyam NEWS

Leave a Comment