28.2 C
Hyderabad
May 8, 2024 23: 45 PM
Slider ఖమ్మం

సమాచార హక్కు చట్టంపై అవగాహన వుండాలి

#shankarnaik

దేన్నయినా సాధించగలమనే ధృడ సంకల్పంతో ముందుకు వెళ్లాలని విద్యార్థులకు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ డా. గుగులోతు శంకర్ నాయర్ దిశా నిర్దేశం చేశారు. ఖమ్మం ప్రభుత్వ కళాశాల విద్యార్ధులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తాను మారుమూల తండాలో జన్మించి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో విద్యనభ్యసించి పట్టుదలతో నేడు రాష్ట్ర సమాచార హక్కు కమీషన్ చైర్మన్ స్థాయికి ఎదగడం జరిగిందని తెలిపారు. విద్యతోనే గౌరవం లభిస్తుందని, విద్యార్ధి దశ నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు. అద్యాపకులు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను, ప్రతిభలను వెలికి తీసే విధంగా విద్యాబోధన జరగాలన్నారు. సమాచార హక్కు చట్టం. సామాన్యుని చేతిలో వజ్రాయుధం లాంటిదని ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారితనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని సెక్షన్ (3) ప్రకారం చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి సమాచార హక్కు చట్టం ఉపయోగించుకునే విధంగా పొందుపర్చడం జరిగింది.

30 రోజుల కాలంలో ఇవ్వాలని, దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని అందించాలని సెక్షన్ 7(1) ప్రకారం. 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వని యెడల, మొదటి అప్పీల్ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని అన్నారు. 30 రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వని క్రమంలో సెక్షన్ 19 (1) ప్రకారం మొదటి అప్పీల్ చేసుకుంటే మొదటి అప్పిలేట్ అధికారి సమాచారం విచారణ చేపట్టి ఇప్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొదటి అప్పిలేట్ అథారిటి ఉంది, పరిష్కారం చేయని యెడల సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషనర్ దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. ఇట్టి జాప్యాన్ని తొలగించి, విద్యార్థులు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు, 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం అందించే విధంగా కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పౌరులకు సమాచారం అందచేయడం, సత్వర పరిష్కారానికి రాష్ట్ర కమీషన్ చర్యలు చేపడుతుందన్నారు. దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర కమిషన్ సెకండ్ అప్పిలేట్ ఆధారిటికి దరఖాస్తు చేస్తే, రాష్ట్ర కమీషన్ మూడు నుంచి ఆరు నెలల లోపే కేసు విచారణ చేపట్టి సమాచారం అందిస్తూ, విజయవంతంగా ముందుకు వెళ్తుందని అన్నారు. సమాచార హక్కుచట్టంపై యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ఎలా ఉపయోగించుకుంటున్నామో, సమాచారహక్కు చట్టాన్ని కూడా అదే తరహాలో సర్వినియోగ పరుచుకోవాలన్నారు.

Related posts

మదర్ టంగ్: మాతృభాషతో సంపూర్ణ మానసిక వికాసం

Satyam NEWS

ధరణి పోర్టల్ తో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోరా?

Satyam NEWS

బంజారాల అతి పవిత్రమైన పండగ తీజ్

Satyam NEWS

Leave a Comment