21.7 C
Hyderabad
December 2, 2023 04: 48 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

#Tirumala

తిరుమలలో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గోగర్భం డ్యామ్‌ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సం నిర్వహించారు.

ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌, విజివో బాలి రెడ్డి దంపతులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8 నుండి 10 గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేపడతారు.

శుక్రవారం తిరుమలలో సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఈ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారు. ఈ కార‌ణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Related posts

108 కు దారివ్వని నగరం.. ట్రాఫిక్ సిబ్బంది తో ఎస్పీ అత్యవసర సమావేశం…!

Satyam NEWS

రెడ్ ఎలర్ట్: నరసరాపుపేటలో కరోనా పాజిటీవ్

Satyam NEWS

బి‌సి భవన్ త్వరగా పూర్తి చేయాలి

Murali Krishna

Leave a Comment

error: Content is protected !!