37.2 C
Hyderabad
May 6, 2024 20: 05 PM
Slider ముఖ్యంశాలు

సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి: తుమ్మల

#tummala

సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో సీతారామ పనుల్లో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఏమాత్రం ప్రణాళిక బద్దంగా సాగలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి సమీక్షలో పాల్గొన్నారు.

సమీక్షలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల వారీగా నిధులుకేటాయించినప్పటికీ..ఎక్కడా సక్రమంగా పనులు పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు ఇష్టానుసారంగా నిధులు కేటాయించినా పనులు మాత్రం పూర్తి చేయలేదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా రైతులు ఆశిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులు ఆశించిన పురోగతి లేదన్నారు.

ఏ పనికి ఎంత ఖర్చు అవసరం, ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు అవసరం అవుతాయన్న అంశాలపై ప్రణాళిక బద్దంగా ప్రత్యేక ప్రణాళికతో వెళ్లకపోవడం వల్లనే సమస్యలు తలెత్తాయన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా హెడ్ వర్క్స్ కు ఎంత ఖర్చు, కాల్వలకు ఎంత ఖర్చు చేయాలి. భూ సేకరణకు ఎన్ని నిధులు అవసరం అవుతాయన్న అంశాలపై వెంటనే సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ సీతారామ పనులు త్వరితగిన పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలోని బుగ్గవాగు చెక్ డ్యాం గతంలో తాను మంత్రిగా ఉన్నమయంలో మంజూరు చేసి నిర్మించామన్నారు. తర్వాత బుగ్గవాగును ఎవరూ పట్టించుకోలేదన్నారు. నిధులు మంజూరైనా నిర్లక్ష్యం కారణంగానే రఘునాథపాలెం మండలానికి  సాగునీరు ఇవ్వలేదన్నారు. వెంటనే బుగ్గవాగు పనులు పూర్తి చేసేలా రైతులకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సీతారామ పూర్తయిన తర్వాత బుగ్గవాగును అనుసంధానం చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో యాసంగికి సాగునీరు ఇచ్చే అంశంపై రైతులకు స్పష్టతనివ్వాలని మంత్రి సూచించారు. సాగర్లో నీటి లభ్యత ఎంత ఉంది, ఈసారి పంటల సాగుకు నీటి విడుదల లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న అంశాలపై రైతులకు తెలియజేయాలని ఆదేశించారు.

Related posts

పరిశుభ్రతతోనే మలేరియాకు చెక్ పెట్టవచ్చు…

Satyam NEWS

పోలీసులకు మంచి నీళ్లు కూడా ఇచ్చేది లేదు

Satyam NEWS

దుబ్బాక లో ఏప్రిల్ 10న లోక్ అదాలత్

Satyam NEWS

Leave a Comment