28.7 C
Hyderabad
April 28, 2024 05: 54 AM
Slider ప్రకాశం

ఆగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికైనా న్యాయం చేయాలి

#agrigold

అగ్రిగోల్డ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రకాశం జిల్లా దర్శి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు అన్నారు. బుధవారం దర్శి మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో అగ్రిగోల్డ్ నాయకుడు పి.నరసయ్య అధ్యక్షతన అగ్రిగోల్డ్ బాధితుల సత్యాగ్రహ దీక్ష శిబిరంను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, వీరిలో 70 శాతం మందికి పదివేల రూపాయల నగదు, 20వేల రూపాయల  లోపు నగదులను ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు జమ చేయడం జరిగిందని, మరో 30 శాతం మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని వీరంతా నిరుపేద కుటుంబీకులని వీరికి కూడా అగ్రిగోల్డ్ నిధులను పంపిణీ చేయాలని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3900 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ కు ఏజెంట్ల బాధితుల ద్వారా నగదు కట్టించుకోవడం జరిగిందని, అందులో 930 కోట్లు రూపాయలు మాత్రమే అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం జమ చేశారు అని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 82,500 ఎకరాలు ఇళ్ల స్థలాల భూములు 23 వేల ఎకరాల భూములు అగ్రిగోల్డ్ కింద ఉన్నాయని ఆయన తెలిపారు.

Related posts

బిసి బాలికల వసతి గృహాంలో సైబర్‌నేరాలపై అవగాహన

Satyam NEWS

పేద ప్రజల ఇండ్ల పట్టాలను తిరిగి ఇవ్వాలి

Bhavani

చిరుధాన్యాలపై అవగాహన సదస్సు

Satyam NEWS

Leave a Comment