విజయవాడలో ఎస్ వి జె కన్స్ట్రక్షన్స్, లచన్ ఇన్ ఫ్రా సంయుక్తంగా నిర్మించిన కెవిఆర్ కైలాస్ ప్రాజెక్టు ను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల సౌకర్యాలతో KVR కైలాస్ ప్రాజెక్టు రావడం సంతోషదాయకమని అన్నారు.
అత్యాధునిక వసతులను అందిస్తూ విజయవాడ పరిసర ప్రజలకు చేరువలో మెరుగైన నాణ్యత ప్రమాణాలతో ప్రాజెక్టు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా SVJ కన్స్ట్రక్షన్స్ అధినేత దేవినేని శీహరి, లచన్ ఇన్ ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ మల్లాది కాశీవిశ్వనాధ్ లను మంత్రి అభినందించారు.
ఈ ప్రాజెక్టు విజయవంతంగా లాంచ్ కావడంతో ఇదే స్పూర్తితో ఇటువంటి మరెన్నో ప్రాజెక్టులను అన్ని వర్గాల వారికి చేరువలో నిర్మించాలని కోరారు. ఏపీ అభివృద్దిలో తమ వంతు తోడ్పాటును అందిస్తామని దేవినేని శ్రీహరి, మల్లాది కాశీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అడిషనల్ ఐజీ మువ్వా వెంకట రాజేష్, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.