40.2 C
Hyderabad
April 28, 2024 15: 16 PM
Slider ఆదిలాబాద్

నిర్మల్ మున్సిపాలిటీలో రూపాయికే నల్ల కలెక్షన్

nirmal water

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని రాష్ట్ర అటవీ,పర్యావరణ ,న్యాయ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్ లో నిర్మల్ మున్సిపాలిటీ లోని వార్డులలోని వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మంజూరు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు, వృద్ధులకు వితంతువులకు పింఛన్లు అందిస్తుందన్నారు. నిర్మల్ పట్టణంలో ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధిచేసిన నీరు అందించేందుకు 45 కోట్లతో పట్టణంలో ఐదు పెద్ద ఓవర్హెడ్ ట్యాంకు లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో మహిళలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు కొత్తగా ఐదు ఎకరాల స్థలంలో 20 కోట్లతో ప్రసూతి భవనం నిర్మించేందుకు చర్యలు, జిల్లా ఏరియా ఆస్పత్రిని వంద పడకల నుండి250 పడకల ఆస్పత్రిగా పెంచామని చెప్పారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు నగర శివారులో రెండు కోట్ల రూపాయల వ్యయంతో గండి రామన్న హరిత వనం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.

ధర్మసాగర్ కు 5 కోట్లతో అభివృద్ధి చేశాం. కోట్ల రూపాయల వ్యయంతో డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్ సంఘ భవనం నిర్మిస్తున్నామని ఇంకా అదనంగా1.20 కోట్ల నిధుల మంజూరీ కోసం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కోరమని, పట్టణంలోని పురాతన (ఓల్డ్) మార్కెట్ ను 50 లక్షల రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారని పాత గోదాం ను  50 లక్షలతో   మాంసము, చేపల మార్కెట్ నిర్మిస్తున్నామని  తెలిపారు.

గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందిస్తున్నామన్నారు. వెల్మల్ బొప్పారం లో 1200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 400 కెవి విద్యుత్ కేంద్రం, సారంగాపూర్ మండల కేంద్రంలో 15 కోట్లతో నిర్మించిన 132/33 విద్యుత్ ఉపకేంద్రంతో కరెంటును నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం. నిర్మల్ మున్సిపాల్టీలో రూ ఒకటిగా నల్ల కనెక్షన్ ఇస్తున్నాం. కుల సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కమ్యూనిటీ హాలును నిర్వహిస్తుందన్నారు.

మంత్రి ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని వివిధ వార్డులలో 67 కుల సంఘాలకు 567 లక్షల రూపాయల విలువగల మంజూరు పత్రాలను, చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవొతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాధికారి రాజేందర్, ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇంకా మహిపాల్ రెడ్డి, జెడ్ పి టి సి పత్తి రెడ్డి ఈశ్వర్ రెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మారుగొండ రాము, గండ్రత్ ఈశ్వర్, మూడుసు సత్యనారాయణ, నజీరుద్దీన్, వాజిద్ అలీ, టిఆర్ఎస్ నాయకులు తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

ముళ్ల పొదల్లో… అపస్మారక స్థితిలో చేతులు కట్టేసి ఉన్న యువతి

Satyam NEWS

ఈ సమస్య ఈనాటిది కాదు..30 ఏళ్ల కిందటే…

Satyam NEWS

శ్రీశ్రీశ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవంలో పోలీసు సేవా దళ్ సేవలు భేష్

Satyam NEWS

Leave a Comment