26.7 C
Hyderabad
May 3, 2024 09: 50 AM
Slider పశ్చిమగోదావరి

స్కిల్ డెవలప్ మెంట్ లో మహిళలకు 30 రోజుల శిక్షణ

#skill development

ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించాలంటే కమ్యూనికేషన్ నైపుణ్యం ఎంతో అవసరమని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సర్ సి ఆర్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె ఏ ఇమ్మాన్యుయేల్ అన్నారు.

సర్ సి ఆర్ రెడ్డి కాలేజీ ఐక్యూఏసి, ఉమెన్ ఎంపవర్ మెంట్ సెల్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నేడు 30 రోజుల కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ మహిళలు ముందంజ వేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమని అన్నారు.

టైలరింగ్, పెయింటింగ్, కమ్యూనికేషన్ కార్యక్రమాలను తరచూ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన వైసీపీ నాయకుడు ఎస్ ఎం ఆర్ పెదబాబు మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడే విధంగా రూపొందవచ్చునని తెలిపారు.

సిఎం జె ఎప్ లయన్ దామోదర రంగారావు మాట్లాడుతూ మహిళా సాధికారిత ప్రక్రియ, నైపుణ్యాభివృద్ధి, ఉత్తమ యాజమాన్య నైపుణ్యత, బాధ్యత మహిళలు ముందుండేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కె ఎస్ విష్ణు మోహన్, పి జి డైరెక్టర్ డాక్టర్ కె ఎ రామరాజు, ఐక్యూఏసి కో ఆర్డినేటర్ డాక్టర్ పి. పాల్ దివాకర్, డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ ఉమెన్ ఎంపవర్ మెంట్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కె పద్మావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

30 రోజుల పాటు కె సుప్రియ ఈ శిక్షణ అందిస్తారు. ఈ కార్యక్రమంలో పిఎం జెఎఫ్ డాక్టర్ వి కె పంకజాక్షన్, జీ.మాణిక్యాల రావు, ఫస్ట్ అండ్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, లయన్ కాకరాల వేణుబాబు, అవినాష్ రాజు, చిట్టూరి నివాస్ తదితర లయన్ నాయకులు, ఉమెన్ ఎంపవర్ మెంట్ సెల్ కో ఆర్డినేటర్ లయన్ ఎస్ హేమ లత, ఛాలెంజర్స్ క్లబ్ సెక్రటరీ కె శైలజ, డి సి డాక్టర్ కొండ రవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్మార్ట్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ ఆదర్శం

Satyam NEWS

రేపు రాజ్యసభ కు హాజరు కానున్న చిదంబరం

Satyam NEWS

ఈ నెల 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ డే

Satyam NEWS

Leave a Comment