38.2 C
Hyderabad
May 3, 2024 21: 20 PM
Slider ప్రత్యేకం

డిజిగ్నేషన్ చిన్నదే హృదయం మాత్రం ఎంతో పెద్దది

police constable

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో కరోనా విధులు నిర్వర్తిస్తున్న రాజంపేట డి.ఎస్.పి పోలీసు వాహన డ్రైవర్, ఏ ఆర్ కానిస్టేబుల్,  చిలకల రాజా, హోంగార్డు ప్రసాద్, రక్షక్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ చంద్రయ్య, హోంగార్డు శ్రీనివాసులు…

ఈ పేర్లు, డిజిగ్నేషన్లు చూస్తే చాలా చిన్నవి గా ఉన్నాయి కదూ? కానీ వీరి హృదయం పెద్దది. గొప్పది. చాలా గొప్పది. వీరంతా లాక్ డౌన్ విధులు పాటిస్తున్నారు. ప్రజలు బయట ఉండకూడదని అందరూ ఇళ్ళల్లో ఉండాలని తెలియజేస్తూ స్థానిక రెడ్డి వారి వీధిలో తిరుగుతూఉన్నారు.

ఓ 60 సంవత్సరాలు వయస్సు గల స్త్రీ పోలీసులకు బయట కూర్చుని కనబడింది. ఆమెని ఇంటి లోపలికి వెళ్ళమని పోలీసులు కోరారు. సార్ నాలుగు రోజులుగా అన్నం లేదు. నాలుగు కుటుంబాలు ఉన్నాయి. పస్తులతో కాలం గడుపుతున్నాము.

చిన్నపిల్లలను వృద్ధులను ఒక్క సారి చూడండి అంటూ ఆమె వారిని చూపించింది. బాధాతప్త హృదయంతో ఆమె చెప్పిన మాటలు, చూసిన దృశ్యం, చూసి చలించి పోయారు ఈ చిన్న డిజిగ్నేషన్ ఉన్న పోలీసులు. రెడ్డి వారి వీధిలోని ఇంటింటికి వెళ్లి, అదే వీధిలో అన్నం లేకుండా గడుపుతున్నవారి గురించి చెప్పారు.

నాలుగు కుటుంబాల వాళ్ళకు సాయం చేయడానికి తలా ఒక చెయ్యి వేయండని అభ్యర్ధించారు. అంతే ఆ వీధిలోని స్థానికులు ఆ నాలుగు కుటుంబాలకు బియ్యం, గోధుమపిండి, కూరగాయలు, బ్రెడ్, సబ్బులు కొంత నగదుతో పాటు ఎవరికి తోచిన విధంగా వారు సాయం అందించారు. విషయం తెలుసుకున్న రాజంపేట డి.ఎస్.పి వి. నారాయణస్వామిరెడ్డి రెడ్డి వారి వీధి లోని ప్రజలకు అభినందనలు తెలియజేయడంతో పాటు వీధిలోని ప్రజలను చైతన్యం చేయడంలో కీలక పాత్ర వహించిన కానిస్టేబుళ్లను ప్రశంసించారు.

Related posts

భారీ వర్షాల కారణంగా తగ్గిపోయిన చార్ ధామ్ యాత్రీకులు

Satyam NEWS

కొట్టుకు చస్తున్న మూవీ ఆర్టిస్ట్‌ (మా) లు

Satyam NEWS

గజిటెడ్ అధికారుల డైరీ ఆవిష్కరించిన సిఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment