27.7 C
Hyderabad
May 4, 2024 10: 55 AM
Slider గుంటూరు

స్మార్ట్ సిటీస్ మిషన్ కోసం రూ.3,538 కోట్లు విడుదల

సాంకేతికతను మెరుగుపరచడం, డేటా నిర్వహణను పెంచడం ద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,538 కోట్లు విడుదల అయినట్లు , అందులో రూ. 2726.43 కోట్లు రాష్ట్రం వినియోగించుకున్నట్లు.. వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ సహాయ శాఖ మంత్రి కౌశల్ కిషోర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఈ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా కేంద్ర 100 నగరాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలు ఎంపిక చేయబడ్డాయని.. ఈ నాలుగు నగరాల్లో 279 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఆమోదం పొందాయని తెలిపారు. వీటిలో 203 ప్రాజెక్టులు 73% పూర్తి కాగా, మిగిలిన 76 ప్రాజెక్టులు 27% ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

విడుదల అయిన నిధుల్లో.. విశాఖపట్నం అత్యధిక నిధులు వినియోగించగా, తిరుపతి, కాకినాడ, అమరావతి తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వివరణ ఇచ్చారు. ప్రాజెక్టుల విషయానికి వస్తే. తిరుపతిలో అత్యధికంగా 105 ప్రాజెక్టులు ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కాకినాడలో 94, విశాఖపట్నంలో 61, అమరావతిలో 19 ఉన్నాయని తెలిపారు.

ఈ నగరాలలో ప్రాజెక్టుల పూర్తి కావటంలో.. తిరుపతి లో 60%, కాకినాడ -76.60%, విశాఖపట్నం – 91.8%, అమరావతి – 63.16% గా ఉందని పేర్కొన్నారు.

Related posts

ఏపీలో క‌లెక్ట‌ర్లు,ఎస్పీలు మార‌డం ఖాయ‌మంట‌…?

Satyam NEWS

ఆధిపత్య పోరు తో నలిగిపోతున్న గ్రామ ప్రజలు

Satyam NEWS

మిగిలిన డిగ్రీ సీట్లు

Murali Krishna

Leave a Comment