29.7 C
Hyderabad
May 3, 2024 05: 04 AM
Slider ప్రత్యేకం

ఏపీలో క‌లెక్ట‌ర్లు,ఎస్పీలు మార‌డం ఖాయ‌మంట‌…?

#AndhraPradeshPolice

ఈ నెల 31 తో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ప‌ద‌వీ కాలం ముగియ‌బోతోంది.ఆ స్థానంలో మాజీ సీఎస్ నీలం సాహానీని నియమిస్తూ గ‌వర్న‌ర్ ఆదేశాలు జారీ చేసారు కూడ‌.

ఈ నేప‌ద్యంలో రాష్ట్ర వ్యాప్తంగా  అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు,ఎస్పీల‌కు స్థాన చ‌ల‌నం ఖాయ‌మ‌న్న వార్త‌లు సోష‌ల్ మీడియాల‌లో చక్కెర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రెండేళ్ల నుంచీ మూడేళ్ల పైబ‌డి జిల్లాలో ప‌ని చేస్తున్న క‌లెక్ట‌ర్లు,ఎస్పీలు క‌చ్చితంగా బ‌దిలీలు అవుతాయ‌ని..విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఇప్ప‌టికే…అందుకు సంబంధించిన స‌మాచారాన్ని సాధార‌ణ ప‌రిపాల‌నా విబాగం సేక‌రించిన‌ట్టు తెలుస్తోంది.ఈ నేప‌ధ్యంలో ముఖ్య‌మైన కొన్ని జిల్లాల‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లా కూడా ఉన్న‌ట్టు బోగ‌ట్టా. విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ గా డా. హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్..జిల్లాకు వ‌చ్చి దాదాపు మూడేళ్లు పైబ‌డి న‌డుస్తొంది.

ఆలాగే  ఎస్పీ రాజ‌కుమారీ.. రెండేళ్లు పూర్తికావ‌స్తోంది. జిల్లాలో ప‌ని చేస్తున్న ఇద్ద‌రికీ..ప‌దోన్న‌త‌లు వ‌చ్చాయి. క‌లెక్ట‌ర్ కు..కార్య‌ద‌ర్శి గానూ ఎస్పీకి డీఐజీగా ను సీఎస్ నుంచీ ఉత్వర్వులు కూడా వచ్చాయి.ఇక ఎక్క‌డ పోస్టింగ్ అన్న‌ది ఉత్త‌ర్వులు రావ‌డ‌మే ఆల‌స్యం.

కాగా సీఎస్ ఆదిత్య నాథ్…ఎవ‌రెవ‌రిని ఎక్క‌డెక్క‌డ వేయాల‌న్న‌ది..సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు వేచి చూస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే  డీఐజీగా ప‌దోన్న‌తి పొందిన విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీకి  మాత్రం.. ప‌క్క‌నున్న విశాఖ జిల్లాలోని మెరైన్ డీఐజీగా  లేకుండా దిశ ను అప్ గ్రేడ్ చేసి…ఆ విభాగానికి డీఐజీగా కేటాయిస్తారనీ తెలుస్తోంది.

జిల్లాకు ఐపీఎస్ దీపిక రానున్న‌ట్టు స‌మాచారం.  ఏదైనా ఈ ఒక‌టి,రెండు రోజుల్లో ఏదో ఒక విషయం తెలిపోనుంది.కానీ క‌రోనా స‌మ‌యంలో  జిల్లాను ఆదిలోన గ్రీన్ జోన్ గా నిల‌బెట్టి….క‌ష్టకాలంలో పోలీస్ శాఖ సిబ్బంది అందునా కానిస్టేబుల్ స్థాయి సిబ్బందికి ఆదుకున్న ఎస్పీ రాజ‌కుమారీ బ‌దిలీ అవుతార‌న్న వార్త‌ను  మాత్రం జిల్లా ప్ర‌జ‌లు అందునా పోలీస్ శాఖ జీర్ణించుకోలేకపోతార‌న్న‌ది మాత్రం వాస్త‌వం.

Related posts

16 నుంచి శబరిమల అయ్యప్ప ఆలయంలో పూజలు

Satyam NEWS

వెన్నుపోటు పొడిచిన మరాఠా యోధుడు

Satyam NEWS

కరీనా వారియర్ ప్రశంస పొందిన కువైట్ కడప వాసి

Satyam NEWS

Leave a Comment