32.7 C
Hyderabad
April 27, 2024 01: 34 AM
Slider పశ్చిమగోదావరి

ఆధిపత్య పోరు తో నలిగిపోతున్న గ్రామ ప్రజలు

#pedavegi

ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో ఓ గ్రామ పంచాయతీలో ఓ మాజీ మహిళా సర్పంచ్ తనయుడు, ప్రస్తుత దళిత మహిళా సర్పంచ్ భర్త మధ్య కొన్ని రోజులుగా పంచాయతీ లో పై ఆధిపత్య పోరుకు కోల్డ్ వార్ జరుగుతున్నట్టు తెలిసింది. గతం లో మహిళా సర్పంచ్ తనయుడు పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు 1లక్షా 50 వేల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.

వాటికి బిల్లులు పెట్టి ఇప్పించాలని ప్రస్తుతం పదవిలో ఉన్న పంచాయతీ బోర్డ్ ని కోరాదని సమాచారం. అయితే ప్రస్తుత దళిత సర్పంచ్ భర్త గతం లో చేసిన పనులకు బిల్లులు పెట్టె విషయం పై తత్సారం చేస్తున్నాడని పంచాయతీలో శానిటేషన్, రహదారులు, త్రాగునీరు వంటి అత్యవసర పనులు అస్తవ్యస్తం గా ఉన్నాయని పంచాయతీ పట్టించుకోవడం లేదని పంచాయతీలో కొంత మంది వ్యక్తుల చేత వారం వారం స్పందనలో ఫిర్యాదులు చేయిస్తున్నట్టు తెలిసింది.

ఈ పంచాయతీ లో మాజీ మహిళా సర్పంచ్ తనయుడుకు, ప్రస్తుత దళిత మహిళా సర్పంచ్ భర్తకు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అధికార పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని గ్రామంలో చెప్పుకుంటున్నారని సమాచారం. జరుగుతున్న పరిణామాలపై సచివాలయ సిబ్బంది ఎటూ తేల్చ లేక సతమతమౌతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటె ఇటీవల పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ కి తెలియ కుండా సుమారు 1లక్షా 60 వేల రూపాయల పంచాయతీ నిధులు బిల్లుల రూపం లో తన బంధువు పేరుతో స్వాహా చేయబోయి అడ్డంగా దొరికిపోయినట్టు జిల్లా పంచాయతీ అధికారులు జరిపిన విచారణలో తెలినట్టు సమాచారం.

Related posts

కోరుట్ల పట్టణంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన

Satyam NEWS

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ శ్యాం కోషీ

Bhavani

వైసీపీ కడప జడ్పీటీసీ చైర్మన్ కు జనసేన నాయకురాలి అభినందనలు…

Satyam NEWS

Leave a Comment