28.7 C
Hyderabad
May 5, 2024 23: 49 PM
Slider నిజామాబాద్

కామారెడ్డిలో శోభాయమానంగా శోభాయాత్ర

#kamareddy

శ్రీరామనవమి సందర్బంగా హిందూ వాహిని, బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీరాముని శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమైంది. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి శోభాయాత్రను కొబ్బరికాయ కొట్టి, జెండాఊపి ప్రారంభించారు.

కామారెడ్డి పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ధర్మశాల, ఇందిరాచౌక్, ప్రభుత్వ ఆస్పత్రి, సుభాష్ రోడ్, పాంచ్ చౌరస్తా, పెద్దబజార్ మీదుగా రైల్వే కమాన్, నిజాంసాగర్ చౌరస్తా, దేవునిపల్లి, విద్యానగర్ సాయిబాబా ఆలయం నుంచి కొట్టబస్టాండ్ వరకు ఈ శోభాయాత్ర సాగనుంది. శోభయాత్రలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శ్రీరాముని విగ్రహం, హనుమాన్, శివాజీ, మహాశివుని విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రత్యేక విద్యుత్ కాంతుల నడుమ డోలు భాజాలతో శోభాయాత్ర సాగింది. యువత పెద్ద ఎత్తున శోబాయాత్రలో పాల్గొని నృత్యాలు చేస్తూ జైశ్రీరామ్ అనే నినాదాలతో మారుమ్రోగించారు. మహా శోభాయాత్ర సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి గంజ్ గేట్ నుంచి రామారెడ్డి రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్ వరకు ట్రాఫిక్ దారి మళ్లించారు.

Related posts

మిస్టరీ: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో యువతి బలి

Satyam NEWS

మహిళలకు అన్ని రంగాలలో సమూచిత స్థానం దక్కాలి

Murali Krishna

నెల్లూరు జిల్లా స్థాయి స్నూకర్ టోర్నమెంట్ లో అందరూ విజేతలే

Satyam NEWS

Leave a Comment