38.2 C
Hyderabad
April 28, 2024 22: 38 PM
Slider రంగారెడ్డి

సిబిఐటి కళాశాల ఆవరణలో ఘనంగా శ్రీరామ నవమి

#cbit

స్వస్తిశ్రీ చాంద్రమాన శోభాకృత్ నామ సంవత్సర ఉత్తరాయణ చైత్రమాస శుక్ల పక్ష శ్రీరామ నవమి వేడుకలు సిబిఐటి, ఎమ్జిఐటి కళాశాల ఆవరణ లో శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానం లో అంగరంగ వైభవం గా జరిగాయి.  ఈ కార్యక్రమానికి నార్సింగి మున్సిపాలిటీ చైర్ పర్సన్ డి రేఖ యాదగిరి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు.  శ్రీ సీతారాములవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

డి రేఖ మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేసి, ఆపై రావణ సంహారం చేసి తిరిగి సీతాసమేతంగా అయోధ్య చేరిన శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడయ్యాడు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ ముహుర్తాన్నే జరిగిందని భక్తుల విశ్వాసమని అన్నారు.  సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరుపుకుని శ్రీ  సీతారాములను పల్లకిలో ఊరేగించారు.

ఆలయ పూజారి శ్రీ శేషు  శ్రీరామచంద్రుడు అచరించిన ధర్మోపదేశాలను, రామాయణ సందేశాలను, శ్రీరామ మంత్రాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయాలను అందంగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు.  నార్సింగి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఆదిత్య రెడ్డి,  కోకాపేట గ్రామా పెద్దలు ముంగి జైపాలరెడ్డి, ఓం ప్రకాష్, కళాశాల పిఆర్ఓ  డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్, తులసి రామ్, విజయ భాస్కర్ రెడ్డి, ఆందోజు శ్రీనివాస్, సిబిఐటి ఎమ్జిఐటి కళాశాల అధ్యాపకులు పెద్దసంఖ్య లో హాజరు అయ్యారు. ఆనంతరం పెద్దయెత్తున అన్నదానం కార్యక్రమం జరిగింది. అన్నదాత   డాక్టర్ ఉండేలా మాలకొండ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలి.. పువ్వాడ

Bhavani

కోటీ 80 లక్షల రూపాయల మాదకద్రవ్యాలు స్వాధీనం

Bhavani

దివ్యాంగ మహిళ జీవితంలో కొత్త వెలుగులు నింపిన కలెక్టర్

Bhavani

Leave a Comment