29.7 C
Hyderabad
May 1, 2024 06: 20 AM
Slider ఖమ్మం

మహిళలకు అన్ని రంగాలలో సమూచిత స్థానం దక్కాలి

#judge

పురాణాలలో స్త్రీని అందరికంటే ముందు అగ్ర పూజ అందవలసిన మాతృమూర్తిగా అభివర్ణించారాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. పాల్వంచ మండలం, బొల్లూరిగూడెం లోని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన న్యాయ అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి మరియు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి. రామారావు ముఖ్య అతిదులు గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి భానుమతి మాట్లాడుతూ మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఎ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలరని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను విలువలతో కూడిన విద్యావిధానాన్ని నేర్పించాలని తెలిపారు. స్త్రీలను ఆరాధించే స్థాయి నుండి రక్షణ కల్పించే స్థాయి వరకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషాధిక్యత నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చిన మహిళలు వారి హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. న్యాయమూర్తి బి. రామారావు మాట్లాడుతూ మహిళలు వంటింటికె పరిమితం కాకుండా విభిన్న రంగాలలో రాణించాలని, ఆర్థిక పరిపుష్టిని పెంపొందించుకోవాలని తెలిపారు. పని ప్రదేశాలలో మహిళలు లైంగికంగా వేధింపులకు గురి అయినట్లయితే సమస్య రూపంలో తెలియజేస్తే వారి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుబ్రోలు రాంప్రసాదరావు, చీప్ లిగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి. పురుషోత్తమరావు, లీగల్ సర్వీసెస్ మెంబర్స్ తోట మల్లేశ్వరరావు, మెండు రాజమల్లు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ నాగ స్రవంతి, జ్యోతి విశ్వకర్మ, పారా లీగల్ వాలంటీర్స్ రాజమణి,అనురాధ,కిషోర్ స్థానిక ప్రజాప్రతినిధులు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది,మహిళలు విద్యార్థినిలు, పాల్గొన్నారు.

Related posts

బూడిదైన పత్తి: ఓ రైతు కుటుంబానికి తీరని నష్టం

Satyam NEWS

సిద్దిపేటలో గన్ పాయింట్ లో రూ.43 లక్షల దోపిడి

Satyam NEWS

(Best) Natural Home Remedies For Diabetes Type 2 How To Reduce Blood Sugar At Home

Bhavani

Leave a Comment