31.2 C
Hyderabad
May 2, 2024 23: 11 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ శోభకృత్ నామ సంవత్సర నూతన పంచ్ఞాగ ఆవిష్కరణ

#shobhakrith

దేశం,రాష్ట్రం,గ్రామంలోని అన్ని మతాల వారు,అన్ని కులాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,పాడి పంటలతో, సమాజ హితాన్ని కోరుకునేది బ్రాహ్మణుడు ఒక్కడే అని తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘాల కోర్ కమిటీ అధ్యక్షుడు, ధూపదీప,నైవేద్య,అర్చక సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారు పోతులపాటి రామలింగేశ్వర శర్మ అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని కొంకపాక శర్మ,కస్తూరి, వేంకటేశ్వర శర్మ కళ్యాణ వేదికలో ఆదివారం కొంకపాక వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో,ధూప,దీప,నైవేద్యఅర్చక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్నంభొట్ల ఫణి కుమార్ శర్మ అధ్యక్షతన శ్రీ శోభకృత్ నామ సంవత్సర నూతన పంచ్ఞాగ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు.

ముందుగా వేద మంత్రోచ్ఛారణల మధ్య జ్యోతి ప్రజ్వలన,అతిథుల స్వాగత ఏర్పాట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు,బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ మాట్లాడుతూ సమాజంలో దేవాలయంలో పనిచేసే అర్చకుడు పాత్ర చాలా విలువైనదని, గ్రామీణ ప్రాంతంలో వివిధ కులాలకు,వివిధ వర్గాలకు చెందిన వారి బాగోగులు తీర్చేందుకు ప్రతిరోజు దేవాలయములో అర్చకుడు సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని అర్థం చేసుకొని దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ అందరి తరపున దేవుని ప్రార్థించే అర్చకుడికి తాను జీవన భృతికి యాచించే అవసరం ఏర్పడిందని అన్నారు.

దీనిని అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి దాని ద్వారా చాలామంది బ్రాహ్మణ పేద విద్యార్థులను విదేశాలకు వెళ్ళి చదువుకునే ప్రోత్సాహం కల్పించిందని,చాలా మంది బ్రాహ్మణులకు ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలు,కుటీర పరిశ్రమలు ఏర్పరచుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ  ఇంతవరకు ఋణాలు మంజూరు కాలేదని అన్నారు.

ప్రభుత్వ అనుబంధంగా పనిచేస్తున్న ‘ఏ’ గ్రేడ్ ‘బి’ గ్రేడ్ దేవాలయాలలోని అర్చకులకు గ్రాంటెడ్ వేతనం ఇప్పించినప్పటికీ దానికి చట్టబద్ధత ఏర్పాటు చేయాలని,దానికోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని, గ్రామీణ ప్రాంతాలలో ధూప,దీప,నైవేద్యం క్రింద తెలంగాణలో 7,000 మంది వరకు పనిచేస్తున్నారని,వారికి 6,000 రూపాయల గౌరవ వేతనాన్ని అందించినప్పటికీ గత కొన్ని నెలలుగా ధూప దీప నైవేద్య గౌరవ వేతనం అందజేయడంలో జాప్యం ఏర్పడిందని, వీటన్నిటిపై పోరాడవలసి ఉందని ఆయన గుర్తు చేశారు.

మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ త్రిమూర్త్యాత్మక చండీ పీఠం వ్యవస్థాపకులు కొంకపాక రాధాకృష్ణ మూర్తి శర్మ మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఇప్పటికి 100 కు పైగా చండీ పీఠం ద్వారా చండీ యాగాలు నిర్వహించటం జరిగిందని,ఈ నెల చివరి వారంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న యాగంలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని కోరారు.అర్చక సంఘం కొరకు గతంలో ఎంతో శ్రమించామని,అది నేడు పటిష్ట పడడం హర్షదాయకమని,ఇంకా అభివృద్ధి చెంది అర్చకుల మిగిలిన సమస్యలను పరిష్కరించాలని కోరారు.

అనంతం వేద మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ శోభకృత్ నామ సంవత్సర నూతన పంచ్ఞాగ ఆవిష్కరణ చేశారు.అర్చక సంఘం,బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో కొంకపాక వేంకటేశ్వర శర్మ, కొంకపాక రాధాకృష్ణ మూర్తి శర్మ లను ఘనంగా సన్మానించగా వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. సూర్యాపేట జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘానికి నూతనంగా కొంకపాక శివవిష్ణువర్ధన్ శర్మను ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో ధూప దీప నైవేద్య అర్చక సంఘం సూర్యాపేట జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు రాయప్రోలు శ్రీరామయ్య శర్మ,గౌరవ అధ్యక్షుడు సరస్వతీభట్ల లక్ష్మీ రమణమూర్తి, ధూప దీప నైవేద్య అర్చక సంఘం సూర్యాపేట ప్రధాన కార్యదర్శి మంత్రమూర్తి ప్ర‌సాద శర్మ,ధూప దీప నైవేద్య అర్చక సంఘం సూర్యాపేట జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అన్నంభొట్ల ప్రణయ్ కుమార్ శర్మ,జిల్లా సహాయక కార్యదర్శి నర్ల శాండిల్య శర్మ,ఉప్పల ఉదయ్ శర్మ, ఇరువంటి శ్రీనివాస శాస్త్రి,నందుల సత్యనారాయణ శర్మ,అరిపిరాల జనార్ధన్ శర్మ,కొంకపాక ధనుంజయ శర్మ, భువనగిరి శ్యామసుందర్,బాచిమంచి గిరిబాబు,రాయప్రోలు భద్రయ్య శర్మ, రంగరాజు వాసుదేవరావు,సాధు సుధాకర్ శర్మ,నరగిరినాధుని రాఘవాచార్యులు, ఇనపగుతికల నరసింహమూర్తి,హరి లక్ష్మణ్ కుమార్ శర్మ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బ్రాహ్మణులు, అర్చకులు పెక్కు సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఇంకా సంక్లిష్టంగానే ఉన్న ములాయం ఆరోగ్యం

Satyam NEWS

సీఎం జగన్ పర్యటన సందర్భంగా సభా స్థలి ఖరారు

Satyam NEWS

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తారా లేదా?

Satyam NEWS

Leave a Comment