39.2 C
Hyderabad
May 3, 2024 12: 35 PM
Slider ప్రత్యేకం

సీఎం జగన్ పర్యటన సందర్భంగా సభా స్థలి ఖరారు

#cmtour

కుంటినవలస ప్రాంతాన్ని పరిశీలించిన విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి

ఈ నెల 25 ఏపీలోని విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంతినవలసలో సీఎం జగన్ బహిరంగ సభా స్థలి నిర్ణయం కావడంతో… జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ నాగలక్ష్మి.. జేసీ మయూరీ అశోక్ లు…సభా స్థలి ప్రాంతాన్ని పరిశీలించారు.సీఎం జ‌గ‌న్ ఈ నెల 25న జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో, ప‌ర్య‌ట‌నా ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.నాగ‌ల‌క్ష్మి ప‌రిశీలించారు. ఈ మేరకు సాయంత్రం మెంటాడ మండ‌లం కుంటిన వ‌ల‌స‌, ద‌త్తిరాజేరు మండ‌లం మ‌ర‌డాం గ్రామాల్లో ప‌ర్య‌టించారు. మ‌ర‌డాం వ‌ద్ద ఏర్పాటు చేస్తున్న బ‌హిరంగ స‌భాస్థ‌లిని సంద‌ర్శించారు. అధికారుల‌తో మాట్లాడి చేస్తున్న ఏర్పాట్ల‌ను తెలుసుకున్నారు.

వ‌ర్షాకాలం కావ‌డంతో, వ‌ర్షం ప‌డినా స‌భ‌కు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ప‌టిష్ట‌మైన స‌భా వేదిక‌ను, షామియానాను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. నిరాటంకంగా స‌భ జ‌ర‌గాల‌ని, ఎటువంటి అంత‌రాయం క‌ల‌గ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. కూర్చోడానికి స‌రిప‌డా కుర్చీల‌ను, లైటింగ్‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. ప్ర‌జ‌లు త్రాగునీటికి ఇబ్బంది ప‌డ‌కుండా, త‌గిన చర్య‌లు తీసుకోవాల‌ని ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారుల‌ను ఆదేశించారు. పార్కింగ్ కోసం కేటాయించిన స్థ‌లాల‌ను ప‌రిశీలించారు. విఐపిల వాహ‌నాల‌కు వేరుగా పార్కింగ్ స్థ‌లాన్ని కేటాయించాల‌ని, సామాన్య ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చే వాహ‌నాల‌కు స‌భాస్థ‌లి స‌మీపంలో పార్కింగ్ ఏర్పాటు చేయాల‌ని పోలీసు అధికారుల‌కు సూచించారు. హెలీప్యాడ్ ప్రాంతాన్ని ప‌రిశీలించి, అక్క‌డ కూడా వీఐపీలు వేచి ఉండ‌టానికి, వాహ‌నాల పార్కింగ్‌కు త‌గిన ఏర్పాటు చేయాల‌న్నారు.  ఆరోగ్య శిబిరాల‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా వైద్యారోగ్య‌శాఖ‌ను, డిసిహెచ్ఎస్‌ను ఆదేశించారు. 

కుంటిన‌వ‌ల‌స‌లో కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం,  శిలాఫ‌ల‌కాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. ఆర్ అండ్ బి ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న నేల‌ను చ‌దును చేసే ప‌నుల‌పై ఆరా తీశారు. వేగంగా ప‌నులు పూర్తి చేయాల‌న్నారు. ఇక్క‌డినుంచి పంచాయితీరాజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న నిర్మిస్తున్న సుమారు 4 కిలోమీట‌ర్ల ర‌హ‌దారి ప‌నుల‌ను త‌నిఖీ చేశారు. రోడ్డును విస్త‌రించి, కొత్త పొర‌ల‌ను వేయ‌డ‌మే కాకుండా, ఇరువైపులా ప‌టిష్ట‌ప‌ర‌చాల‌ని సూచించారు. ప‌నులు రాత్రీప‌గ‌లూ నిర్వ‌హించి, త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఏర్పాటు చేస్తున్న ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. స‌మ‌గ్ర వివ‌రాల‌తో ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, ఇంజ‌నీర్లు పాల్గొన్నారు.

Related posts

తాడేపల్లిలో సీఎం జగన్ తో సినీ నటుల భేటీ

Satyam NEWS

ఏపీలో ఒకే సారి 14 మంది కలెక్టర్ల బదిలీ…

Satyam NEWS

హైదరాబాద్ మెట్రో రైల్ పుస్తకానికి జాతీయ అవార్డు

Satyam NEWS

Leave a Comment