27.7 C
Hyderabad
May 7, 2024 10: 05 AM
Slider మహబూబ్ నగర్

సోమశిల- సిద్దేశ్వరం వంతెనకు పునాది ఆనాటి మంత్రి జూపల్లి

#Jupally

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చింది మేమంటే మేమని గొప్పలు చెప్పుకుంటూ కాలం గడుపుతారు పేటీఎం బ్యాచ్. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ లో చెప్పుకునే సమయం వచ్చినప్పుడు చెప్పుకోలేరు, మాట్లాడలేరు…. సోమశిల-సిద్దేశ్వరం వంతెన పైన అసెంబ్లీలో మాట్లాడుతూ దాని నిర్మాణం పూర్తయిందంటూ ప్రగల్భాలు పలుకుతుంటారు. అసలు సోమశిల-సిద్దేశ్వరం వంతెన నిర్మాణ అంశాన్ని మొదటగా తెరపైకి తెచ్చింది… దానికి నిధులు కేటాయించి…. శిలాఫలకం వేసింది నాటి మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇది కాదని ఎవరైనా  సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి మెట్లెక్కి చెప్పగలరా? నేడు అధికారంలో ఉన్న వారు కానీ, ప్రతిపక్షపార్టీల వారు కానీ చెప్పలేరు.

2007 లో కృష్ణా నదిలో పుట్టి మునిగి 60మందికి పై గా మృతి

కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు 2007లో రాయలసీమ ప్రాంతం నుండి కృష్ణా నదిలో పుట్టి ద్వారా ప్రయాణం చేస్తుండగా ప్రమాదం జరిగింది. భక్తులు వస్తున్న పుట్టి మునిగి సుమారు 60మంది పైగా చనిపోయారు. అదే సమయంలో కొల్లాపూర్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరొకసారి ఇలాంటి ప్రాణ హాని జరగకుండా సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తో వంతెనకు నిధులు కేటాయించి శిలాఫలకం వేశారు. 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం అనంతరం వంతెన నిర్మాణం చేయడానికి జూపల్లి కృష్ణారావు వెనక్కి తగ్గలేదు. అప్పటికే మంత్రిగా వున్న జూపల్లి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో నిధులు ఎక్కువగా కేటాయించారు. ఇది వాస్తవం కాదని ఎవరైనా అంటే సింగోటం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మెట్లు ఎక్కి పలకాలి. ఎందుకంటే సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి వంతెన నిర్మాణానికి సంబంధం ఉంది.

రెండు రాష్ట్రాలు విడిపోవడంతో  పెండింగ్ లో వంతెన

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకై జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమయ్యారు.2014 తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రాలు విడిపోవడంతో వంతెన నిర్మాణంపై ప్రభుత్వం మొగ్గు చూపలేదు. అయిన టెండర్లు కూడా జరిగినవి అనికూడా అన్నారు.

సోమశిల – సిద్దేశ్వరం వంతెన ముద్దు… ప్రాజెక్టు వద్దు

2018 ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి.2019 ఏపీలో జరిగిన ఎన్నికలలో ప్రభుత్వాలు మారిపోయాయి. రెండు తెలుగు ప్రభుత్వాలు స్నేహపూర్వకంగా ఉన్నాయి. ఆ తర్వాత  వంతెన ఏర్పాటుకు హామీ వచ్చింది. ప్రస్తుతం 600కోట్లు కేటాయించం అని ప్రభుత్వం చెబుతుంది. వంతెన నిర్మాణానికి 2007లోనే  అప్పటి కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి  పునాది వేశారనీ చెప్పవచ్చు. ప్రాణ నష్టం జారవద్దనే  సోమశిల- సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి కృషి చేశామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు.  వంతెనతో పాటు ప్రాజెక్ట్ కట్టి నీరు తీసుకపోతమంటే   ఒప్పుకునేది లేదని జూపల్లి అంటున్నారు. ప్రాజెక్ట్ కడితే కొల్లాపూర్ పచ్చని భూములు ఎడారిగా మారిపోతాయి. రైతు కళ్లల్లో నీలు చూడాల్సి వస్తుందనీ అంటున్నారు. కేవలం ప్రాణ నష్టం జరగకూడదు. ట్రాన్స్ పోర్ట్ పెరగాలి,దూరం తగ్గడం కోసం  మాత్రమే అప్పుడు సోమశిల – సిద్దేశ్వరం వంతెన నిర్మాణం జరగాలని కోరుకున్నట్లు  జూపల్లి చెబుతున్నారు.

అవుట రాజశేఖర్, కొల్లాపూర్

Related posts

మణిపూర్ ఘటనకి కేంద్రం దే బాధ్యత

Satyam NEWS

దుబ్బాక గెలుపు చారిత్రాత్మకం

Sub Editor

టియుడబ్లుజె జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment