40.2 C
Hyderabad
April 29, 2024 17: 23 PM
Slider విజయనగరం

మణిపూర్ ఘటనకి కేంద్రం దే బాధ్యత

#manipur

గత 90 రోజులుగా మణిపూర్ లో మారణకాoడ జరుగుతున్నా కేంద్రం కనీషం శాంతిని పునరుద్ధరించే ప్రయత్నం చేయకుండా ఆ అల్లర్లు లో మంట కాగుతున్న బీజేపీ ప్రభుత్వం, మోడీ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మణిపూర్ రాష్ట్ర ప్రభూత్వాన్ని భర్తరఫ్ చేసి శాంతిని పునరుద్ధరించే ప్రయత్నం చేయాలనీ సీపీఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సుర్యాన్నారాయణ డిమాండ్ చేశారు. మణిపూర్ ఘటన కు నిరసనగా సీపీఎం జిల్లా కమిటీ అధ్వ ర్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన నిరసన దీక్ష నుద్దేశించి ఆయన మాట్లాడారు. ఇద్దరు కుకీ మైనార్టీ గిరిజన తెగల మహిళలు ను నగ్నంగా ఊరేగించిన ఘటన భారత దేశం ప్రతిష్ట దిగార్చిన ఘనత బీజేపీ దేనని, ఇప్పటి కైన మహిళలూ ను నగ్నంగా ఊరేగించిన వారిని కటినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. మణిపూర్ లో మత కలహాలు సృష్టించే వారిని, కంట్రోల్ చేసి శాంతి ని పునరుద్ధ రించాలని కొరారు. మణిపూర్ గనులు కార్పొరేట్ శక్తులు కీ అప్ప చెప్పేందుకు జరుగుతున్నా కుత్రన్ను ప్రజలంతా ఖండించాలని సీపీఎం చేస్తున్నా పోరాటానికి ప్రజలంతా మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, వి. లక్ష్మి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి. రమణమ్మ, a. జగన్ మోహన్, నగర నాయకులు, బి. రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి  రవి కుమార్, విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయందే కీలక పాత్ర

Satyam NEWS

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు

Satyam NEWS

కరోనా ఎలర్ట్: సమిష్టి కృషితో కరోనాను తరిమికొడదాం

Satyam NEWS

Leave a Comment