29.2 C
Hyderabad
May 11, 2024 02: 52 AM
Slider నిజామాబాద్

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమారులదే

#kamareddy

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత కుమారులదేనని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ భవనంలో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పట్ల కుమారులు బాధ్యతగా ఉండాలని సూచించారు.

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పారు. వయో వృద్ధులకు తగిన గౌరవం ఇవ్వాలని, వారిజి సమాజంలో సముచిత స్థానాన్నిచ్చి గౌరవించవలసిన అవసరం ఉందన్నారు. వృద్ధులను పోషించని వారి కుమారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధులను పోషించే విధంగా సీనియర్ సిటిజన్ ప్రతినిధులు సేవలందిస్తున్నారని తెలిపారు. సీనియర్ సిటిజన్ ప్రతినిధులు సమాజ సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. 70 ఏండ్లు దాటిన వృద్ధులు ప్రతిరోజు నడక, క్రీడలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతోందని సూచించారు.

ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు కేటాయించిన ప్రత్యేక సీట్లలో ఇతరులు కూర్చోకుండా చర్యలు చేపట్టే విధంగా ఆర్టీసీ అధికారులతో చర్చిస్తానని తెలిపారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు సన్మానం చేసి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరావు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు విఠల్ రావు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, రిటైర్డ్ ఉద్యోగులు భద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారిని రమ్య, జిల్లా బాలల సంరక్షణ అధికారిని స్రవంతి, అధికారులు పాల్గొన్నారు.

ఉపాధి పనులు వేగవంతం చేయాలి

జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల స్థాయి  అధికారులకు, క్షేత్ర సహాయకులకు ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచడానికి ఊట చెరువులు, ఫాంపౌండ్, ఫిష్ పాండ్లను నిర్మించాలని సూచించారు.

ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం

ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో వచ్చే విధంగా చూడాలన్నారు. కేంద్ర బృందాలు గ్రామాల్లో పర్యటించే వీలున్నందున పనులు చేపట్టిన స్థలంలో వర్క్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఏడు రికార్డులను సజావుగా నిర్వహించాలని సూచించారు. పనులు చేయించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్డిఓ సాయన్న, అధికారులు పాల్గొన్నారు.

ఈవిఎం గోదాముల పరిశీలన

కామారెడ్డి ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలను చూశారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరిండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

గోదాములో సిసి కెమెరా పనితీరును పరిశీలిస్తూ

Related posts

చర్చీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన

Satyam NEWS

భార్య ఫిర్యాదుతో భర్త మనస్థాపం: ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

సీఎం స్వంత జిల్లాలో రక్షకుడే కీచకుడైన వేళ…

Satyam NEWS

Leave a Comment